How To Burn Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ వెన్నెల కరగాలంటే.. ఇలా వ్యాయామాలు చేయండి చాలు..

Burn Belly Fat In 7 Days: ఆరోగ్యవంతమైన శరీరం అంటే జబ్బులు లేని శరీరం మాత్రమే కాదు. దీనితో పాటు సమతుల్య ఆహారం, సరైన బరువు, సరైన మానసిక నియంత్రణ కూడా అవసరం ఎంతో అవసరం. ఇవన్నీ ఉంటేనే మనిషి ఆరోగ్యవంతంగా ఉన్నడనడాని చెప్పొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 02:26 PM IST
  • బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతున్నారా..
  • భుజంగాసనం వేయండి
  • వెన్నెముకను బలంగా చేస్తుంది
How To Burn Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ వెన్నెల కరగాలంటే.. ఇలా వ్యాయామాలు చేయండి చాలు..

Burn Belly Fat In 7 Days: ఆరోగ్యవంతమైన శరీరం అంటే జబ్బులు లేని శరీరం మాత్రమే కాదు. దీనితో పాటు సమతుల్య ఆహారం, సరైన బరువు, సరైన మానసిక నియంత్రణ కూడా అవసరం ఎంతో అవసరం. ఇవన్నీ ఉంటేనే మనిషి ఆరోగ్యవంతంగా ఉన్నడనడాని చెప్పొచ్చు. శరీరం ఆరోగ్యండా ఉండడానికి యోగా చేయాల్సి ఉంటుంది. యోగా చేస్తే మనిషి దృఢంగా ఉండగలుగుతారు. మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సహకరిస్తుంది. పొట్ట, నడుము చుట్టూ కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే దీని కోసం పలు రకాల భంగిమల్లో భుజంగాసనం వేయాల్సి ఉంటుంది. భుజంగాసనాన్ని ఆంగ్లంలో కోబ్రా పోజ్ అని అంటారు. ఈ పోజ్‌ను రోజూ వేయడం వల్ల శరీరం ఆకృతి కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా పలు రకాల నియంత్రణలతో పాటు ఈ యోగా భంగిమ వేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో తప్పకుండా  సూర్య నమస్కారాలు కూడా వేయాల్సి ఉంటుంది.

భుజంగాసనం వేయడం వల్ల కలిగి ప్రయోజనాలు తెలుసుకుందాం..

1. పెరిగిన పొట్టను తగ్గించడంలో సహాయపడుతుంది:
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైట్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం..యోగా ఆసనాలు పెరిగిన పొట్టను తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళల్లో ఉదర స్థూలకాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే భుజంగాసనాన్నివేయడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా శరీరం కూడా దృఢంగా మారుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.

2. ఊపిరితిత్తుల బలోపేతం:
ఊపిరితిత్తులు శరీరానికి చాలా ప్రధానమైనవి. వీటి వల్లే శరీరం ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. అయితే ఊపిరితిత్తులు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల యోగా ఆసనాలు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భుజంగాసనం వేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు దూరమవడమేకాకుండా.. బలోపేతంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యోగా, వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

3. వెన్నెముకను బలంగా చేస్తుంది:
భుజంగాసనం వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వెన్నెముకను బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా భుజంగాసనం వేయాల్సి ఉంటుంది. దీని వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తోంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ వెన్నెల కరుగుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News