Breakfast Benefits: నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే రాత్రి భోజనం మానేసినా ఫరవాలేదు గానీ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ మానకూడదంటారు. ఆధునిక జీవన విధానంలో ఆలస్యంగా నిద్రలేవడం, ఒకేసారి మద్యాహ్నం లంచ్ చేయడం చేస్తుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరం. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
మనిషి జీవిత దినచర్యలో బ్రేక్ ఫాస్ట్ అనేది అత్యంత ముఖ్యమైన ఆహారం. బ్రేక్‌ఫాస్ట్ ఎంత ముఖ్యమో తెలిసినా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. స్కిప్ చేస్తుంటారు. ఈ కోవలో యువత ఎక్కువగా ఉంటున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. బ్రేక్‌ఫాస్ట్ ఎందుకంత ముఖ్యమనేది పేరులోనే ఉంది. బ్రేక్ ద ఫాస్ట్. అంటే రాత్రంతా చేసిన ఉపవాసానికి బ్రేక్ అని అర్ధం. రాత్రంతా శరీరంలోని మెకనిజం ఎదుగుదల, మరమ్మత్తు వంటి అంశాలకు ఎక్కువ ఎనర్జీ, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాల్ని వినియోగించుకుంటుంది. అందుకే ఉదయం లేవగానే ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి వంటి పోషకాలతో నిండిన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే డైట్ బ్యాలెన్స్ అవుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ వల్ల లాభాలు
బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల మస్తిష్కానికి ఎనర్జీ లభిస్తుంది. ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌తో శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది. తద్వారా మెదడు సరిగ్గా పనచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని మెటబోలిజం వేగవంతమౌతుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు వేగంగా కరిగి బరువు నియంత్రణలో దోహదపడుతుంది.
ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఫలితంగా మధుమేహం వంటి వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే అదే పనిగా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారో అప్పుడే మధుమేహం ముప్పు పెరుగుతుంది. ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎండోఫిన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా మూడ్ బాగుంటుంది. మూడ్ స్వింగ్స్ ఉండవు. ఒత్తిడి దూరమౌతుంది.
బ్రేక్‌ఫాస్ట్ చేయనివారిలో అధిక బరువు సమస్య ఉండవచ్చు. ఎందుకంటే మద్యాహ్నం భోజనం ఎక్కువగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఆకలి పెరుగుతుంది. అదే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే అలవాటుంటే ఆ పరిస్థితి అదుపులో ఉంటుంది. పరోక్షంగా ఇది బరువు నియంత్రణలో దోహదపడుతుంది.
Also read: Strawberries Health: స్ట్రాబెర్రీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Breakfast Benefits: బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేయకూడదు, కలిగే లాభాలేంటి