Beyond Blood Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ 5 జబ్బులు కూడా ప్రాణాంతకం..

Beyond Blood Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే వీరికి మరో 5 రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకంగా మారక ముందే అప్రమత్తమవ్వడం మంచిది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 14, 2024, 10:46 AM IST
Beyond Blood Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ 5 జబ్బులు కూడా ప్రాణాంతకం..

Beyond Blood Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే వీరికి మరో 5 రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకంగా మారక ముందే అప్రమత్తమవ్వడం మంచిది.

కార్డియో డిసీజ్‌..
డయాబెటిస్‌తో బాధపడే వారికి గుండె సంబంధిత వ్యాధులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది రక్తంలో చక్కర స్థాయిలో పెరిగి రక్తనాళాలను డామేజ్ అయ్యే అవకాశం ఉంది.  దీంతో అదరోక్లోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కార్డియో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు దీనికి అనుకూలమైన లైఫ్ స్టైల్ నిర్వహించాలి.

కిడ్నీ డిసీజ్‌..
డయాబెటిక్ రెటినోపతి అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సాధారణం. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కిడ్నీలను డామేజ్ చేస్తాయి. ఇది ప్రాణాంతకం  కిడ్నీ డిసీజ్‌ కి కారణమవుతుంది. ఈ స్థితిలో పరిస్థితి విషమిస్తే డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ముందస్తుగానే ప్రమాదాన్ని గుర్తించి కిడ్నీ నిర్వహణకు అవసరమైన పోషకాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: చక్కెరకు బదులుగా ఈ 7 మీ డైట్లో చేర్చుకోండి.. ఏ రోగాలు రావు..

రెటినోపతి..
షుగర్ వ్యాధితో బాధపడే వరకు డయాబెటిక్ రెటినోపతి కూడా సాధారణం. ఇది కళ్ళని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే వదిలేస్తే చికిత్స చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. డయాబెటిక్ పేషంట్స్ తరచూ కంటి పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.

న్యూరోపతి..
నరాల డ్యామేజీ సమస్య కూడా డయాబెటిస్ లో సాధారణం దీనివల్ల చేతుల్లో, కాళ్లల్లో తిమ్మిరి స్పర్శ లేని, నొప్పి సమస్య ఏర్పడుతుంది. ఇది కాళ్లలో, చేతుల్లో కనిపిస్తుంది. సరైన షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటే మీ న్యూరో వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

ఇదీ చదవండి: కొబ్బరినీరు VS నిమ్మకాయనీరు.. ఎండకాలం శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది ఏది?

ఒబెసిటీ..
డయాబెటిస్ సమస్య ఉన్నవారు అధికంగా శరీర బరువు కూడా అధికంగా పెరిగిపోతుంది. షుగర్ లెవెల్స్ సరైన స్థాయిలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి సరైన డైట్ ఎక్ససైజ్ మందులు తీసుకోవడం వల్ల ఒబేసిటీని అధిరోహించొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News