Weight Loss Best Tips 2023: వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది ఆహారాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ శరీర బరువును నియంత్రించడాని తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి రాత్రి పూట ఆహారాలు మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి భోజనం చేయకపోవడం ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసా?:
మీరు బరువు తగ్గడానికి రాత్రి భోజనం చేయకపోతే..అనారోగ్య సమస్యలు దగ్గరుండి తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట ఆహారాలు తీసుకోకపోతే తీవ్ర ఆకలితో పాటు పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా రాత్రి పూట ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా రాత్రి పూట భోనం మానుకోవడం వల్ల జీవక్రియపై కూడా తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కేలరీలను బర్న్ చేసే శరీర సామర్థ్యం తక్కువ అవుతుంది.దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గకుండా ఉంటాయి. బరువు తగ్గడం చాలా ఇబ్బందిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం చేయకపోవడం వల్ల శరీరానికి పోషకాలు అందటంలో ఆటకం కలుగుతుంది. దీని వల్ల శరీరంలో బలహీనత ఏర్పడి అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా దీని కారణంగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి. దీని కారణంగా ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి.
రాత్రి భోజనం చేయకపోతే ఊబకాయం వస్తుందా?:
ప్రముఖ డైటీషియన్స్ అభిప్రాయం ప్రకారం..అల్పాహారం, మధ్యాహ్న భోజనం తీసుకోవడం ఎంత ముఖ్యమో, రాత్రి భోజనం చేయడం కూడా అంత ముఖ్యమని పేర్కోన్నారు రాత్రి భోజనం మానుకునేదానికి బదులు రాత్రిపూట తేలికపాటి ఆహారాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట తక్కువ మసాలాలు, తక్కువ నూనెతో కూరగాయలతో తయారు చేసిన కూరలతో పాటు, ఒక రోటీని తినడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా రాత్రి పూట 8 గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మరియు నూనె పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. లేకపోతే బరువు తగ్గే అవకాశాలుండవని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Building Collapses Video: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో చూశారా..!
Also Read: Suma Adda Show: సుమక్కా.. అవి లారీ కింద నిమ్మకాయలు.. ఎంత పనిచేశావ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook