Sleep for Beauty: మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంతవసరమో..నిద్ర కూడా అంతే అవసరం. అందంగా కన్పించాలంటే నిద్ర ఉండాల్సిందే. అవును నిద్రకు అందానికి సంబంధముంది. కంటి నిండా నిద్రలేకపోతే..ఏం జరుగుతుంది.
మనిషి జీవించేందుకు ఆరోగ్యం ఎంత అవసరమో..ఆరోగ్యంతో పాటు బాహ్య సౌందర్యం కూడా కీలకమే. మనిషి ఆనందంగా ఉండేందుకు తోడ్పడే కొన్ని అంశాల్లో అందం ఒకటి. ఏదో క్రీములు, సబ్బులు వాడేస్తే అందం వచ్చేయదు. అందంగా కన్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా..కంటి నిండా నిద్రలేకపోతే మాత్రం అంతా వృధా అంటున్నారు నిపుణులు. అవును మరి. నిద్రకు అందానికి పూర్తిగా సంబంధముంది. చర్మం కాంతివంతంగా మారాలంటే సరిపడా నిద్ర అవసరం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటినిండా అవసరం.
ప్రస్తుతం..ఆధునిక జీవన శైలి (Modern Lifestyle) కారణంగా నిద్రలేమి సమస్య ప్రధానంగా మారింది. నిద్ర లేమికి చాలా కారణాలే చెప్పుకోవచ్చు. జీవన విధానం, ఆహార పదార్ధాల వల్ల నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రకు ఉపక్రమించే సమయాల్లో ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టీవీల్లో మునిగిపోవడం కూడా కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. మొబైల్ ఫోన్స్ వినియోగం ఎంత తగ్గిస్తే కళ్లు అంతగా మెరిసిపోతాయి. అందుకే నిద్రపోయేందుకు ఓ అరగంట ముందే మొబైల్ ఫోన్స్, టీవీలకు దూరంగా ఉండాలి.
సూర్యకాంతి కూడా నిద్రకు చాలా అవసరమౌతుంది. సూర్యకాంతి ద్వారా శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ విడుదలై నిద్రకు దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ కాస్సేపు ఎండలో ఉంటే మంచిది. ఇక పడుకునే ముందు మీ గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే మంచి నిద్ర పడుతుందట. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుతం అపార్టా్ మెంట్ కల్చర్ కారణంగా ఇది సాధ్యపడటం లేదు. ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోత మెలటోనిన్ హార్మోన్ తక్కువ మొత్తంలో విడుదలై నిద్ర పట్టదు. అందుకే ప్రతిరోజూ త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ రాత్రి పూట త్వరగా భోజనం పూర్తి చేసుకుని త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆహారం ఆలస్యమయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ , అజీర్తి సమస్యలెదురవుతాయి. ఫలితంగా కంటికి నిద్ర దూరమవుతుంది. ప్రతిరోజూ తలకు మస్సాజ్ చేసుకోవడం వల్ల కూడా నిద్ర పడుతుంది. మనస్సు ప్రశాంతమై..అలసట దూరమై నిద్ర(Sleep)ఆవహిస్తుంది. మీ బెడ్‌రూమ్‌లో పర్‌ఫ్యూమ్ ఉంటే మానసిక ఆహ్లాదం ఉంటుంది. అందంగా కన్పించాలంటే తప్పకుండా కావల్సినంత నిద్రపోవల్సిందే.
Also read: Lemongrass: లెమన్ గ్రాస్ ప్రయోజనాలు, స్కిన్ అండ్ హెయిర్ కేర్‌లో ఎలా ఉపయోగపడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.