Low BP Remedy: మీరు తరచూ లో బీపీతో బాధపడుతుంటే..ఈ ఆయుర్వేద చిట్కా ట్రై చేయండి

Low BP Remedy: ఆధునిక జీవన విధానంలో రక్తపోటు ప్రధాన సమస్యగా మారింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కాగల సమస్య. అందుకే ఈ సమస్యను సకాలంలో నియంత్రించగలగాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2023, 03:07 PM IST
 Low BP Remedy: మీరు తరచూ లో బీపీతో బాధపడుతుంటే..ఈ ఆయుర్వేద చిట్కా ట్రై చేయండి

Low BP Remedy: ఆధునిక జీవన శైలిలో రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చాలా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇందులో రక్తపోటు మరీ ప్రమాదకరం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హై బీపీ కాగా రెండవది లో బీపీ. రెండూ ప్రమాదకరమే. 

రక్తపోటు ఎక్కువగా ఉన్నా లేక తక్కువగా ఉన్నా రెండూ ప్రమాదకర పరిస్థితులే. రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు కొన్ని ఆయుర్వేద విధానాలు అందుబాటులో ఉన్నాయి. రక్తపోటు అధికంగా ఉంటే తీవ్రమైన వ్యాధులు తలెత్తవచ్చు. అదే విధంగా రక్తపోటు తక్కువగా ఉన్నా సరే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సాధారణ ఆరోగ్యవంతుడి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ 120/80 ఉండాలి. దీనికి అటూ ఇటూ తేడా ఎక్కువగా ఉంటే అప్రమత్తం కావాలి.

ఎవరికైనా రక్తపోటు 90/60 mm Hg కంటే దిగువ ఉంటే లో బీపీ లేదా హైపర్‌టెన్షన్ అంటారు. సాధారణం కంటే ఎక్కువగా ఉంటే హై బీపీ అంటారు. రక్తపోటు సాధారణంగా ఉన్నప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ ఇటీవలి చెడు జీవనశైలి కారణంగా రక్తపోటు ప్రధాన సమస్యగా మారిపోయింది. ప్రతి పదిమందిలో నలుగురికి కచ్చితంగా ఈ సమస్య ఉంటోంది. ఎవరైనా వ్యక్తి శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు బీపీ లో ఉంటుంది. అందుకే రోజూ తగినంత నీళ్లు తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. తద్వారా నీటి కొరత లేకుండా చూసుకోవాలి. 

రక్తపోటును నియంత్రణలో, సామాన్యంగా ఉంచాలనుకుంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. ఇందులో అర చెంచా హిమాలయన్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ కలిపి తాగాలి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ సాదారణంగా ఉంటుంది. బీపీ లో అయితే ఇలా సాల్ట్ వాటర్ తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. హిమాలయన్ సాల్ట్ లేక రాక్ సాల్ట్ అనేది ఆయుర్వేదపరంగా చాలా మంచిది. ఈ సాల్ట్ వల్ల వాతం , పిత, ఛాతీలో పేరుకునే కఫం అన్నీ దూరమౌతాయి. హిమాలయన్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్‌లో పొటాషియం తగిన పరిమాణంలో ఉంటుంది. ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

Also read: High Blood Pressure: ఈ 2 ఆసనాలతో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News