ప్రతి రోజూ పాలు తాగితే మంచిదని తెలుసు మనకు. అదే పాలకు కాస్త పసుపు జోడించి చూడండి. ఎన్నెన్ని అద్భుతాలు లభిస్తాయో..చూడండి. పసుపు పాలతో కలిగే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
కరోనా వైరస్ ( Corona virus ) ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ బలవర్ధకమైన ఆహారం ( Healthy food ) పై శ్రద్ద ఎక్కువైంది. పాతకాలం నాటి ఆహారపదార్ధాలు, పానీయాన్ని తిరిగి అలవర్చుకుంటున్నాం. కారణం రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవాలనే ఆలోచన. ఈ క్రమంలో మరోసారి వెలుగులోకి వచ్చింది పసుపు పాలు. ఆ పసుపు పాలతో కలిగే ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం.
రోజూ పాలు తాగే అలవాటనేది అందరికీ ఉంటుంది కదా. దానికి కాస్త పసుపు కలిపి తాగండి. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక పదార్ధాలు మస్తిష్కాన్ని చురుగ్గా ఉంచుతాయి. పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు మూడు గ్లాసుల పాలు తాగేవారు చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉంటారనేది పరిశోధనలు చెబుతున్న మాట.
ఈ పాలకు పసుపు తోడైతే అదనపు ప్రయోజనాలు కచ్చితంగా లభిస్తాయి. ఇది పాతకాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు పసుపు పాలను ( Turmeric milk ) తాగడం వల్లనే ఆరోగ్యంగా..ధృడంగా ఉండేవారు. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడేవారు పసుపు పాలను తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చాలామందికి కఫం పెద్ద సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. వెచ్చని పసుపుపాలను తీసుకుంటే కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో సెరిటోనిన్ ( Serotonin ) అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దాంతో నిద్ర హాయిగా పడుతుంది. Also read: Fermented Foods: ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
పసుపుపాలతో లాభాలు..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ దాడి నుంచి కాలేయాన్ని( liver ) రక్షిస్తుంది. రోజూ పసుపుపాలు సేవిస్తే.. కాలేయ సంబంధమైన పచ్చ కామెర్లు వంటివి రావు. కాలేయంలో చేరే విష కారకాలను హరిస్తుంది. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండా తాగాలి. వీటిలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్ ( Lymphatic system ) ను శుభ్రపరుస్తాయి. మరోవైపు పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది.
నీళ్ల ద్వారా మన శరీరంలోకి చేరుకునే వైరస్..త్వరగా రెట్టింపవకుండా నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. Also read: Disposable Paper Cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా ? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా ?