Benefits Of Green Tea And Lemon: శీతాకాలంలో వాతావరణం లో తేమ పెరగడం వల్ల సులభంగా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గి తీవ్రంగా అనారోగ్య సమస్యలతో పాటు అంటు వ్యాధులు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. క్రమంలో తప్పకుండా శరీరం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే చాలామందిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పానీయాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన గ్రీన్ టీని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
నిమ్మకాయను గ్రీన్ టీలో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ ఆరోగ్యంగా మారుతుంది:
గ్రీన్ టీలో నిమ్మ రసాన్ని కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే వ్యాధులనుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా గ్రీన్ టీ ని తీసుకోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తి:
గ్రీన్ టీ లో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి అధిక పరిమాణంలో లభించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో చలికాలంలో తేమ వల్ల వచ్చే దగ్గు జలుబు సమస్యలతో సులభంగా దూరమవుతాయి. కాబట్టి రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు ఇలా తయారు చేసిన గ్రీన్ టీ ని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.
బరువు తగ్గడం :
గ్రీన్ టీ లో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీర బరువును కూడా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీర బరువు తగ్గాలనుకునేవారు కీటో డైట్ లో భాగంగా గ్రీన్ టీ లోని నిమ్మరసాన్ని కలుపుకొని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
చర్మం సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యానికి సూచించిన ఈ చిట్కాను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనికోసం ప్రతిరోజు గ్రీన్ టీ లో నిమ్మరసాన్ని వేసుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా గ్రీన్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా
Also Read : Mahesh Babu Wife : నాలో వేడి పుట్టించండంటోన్న మహేష్ బాబు భార్య.. కొత్త లుక్కుతో షాకిచ్చిన నమ్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook