Benefits Of Coriander Juice: కొత్తిమీరని రసంగా చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కొత్తిమీరలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అధిక బరువు సమస్య అనేది ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. అలాగే కొత్తిమీర వల్ల కలిగే ప్రతి కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొత్తిమీరలో ప్రోటీన్, ఫైబర్,కొవ్వు, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, ఐరన్,కాల్షియం ఇతర పోషకాలు అధికంగా లభిస్తాయి.దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కొత్తిమీర రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
✦ కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం అధికంగా దొరుకుతుంది.
✦ కొత్తిమీర రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుతుందని నిపుణులు చెబుతున్నారు.
✦ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.✦ కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి.
Also Read: Weight Gaining: సన్నగా ఉన్నారా? చలి కాలంలో శరీర బరువు పెంచే పండ్లు ఇవే..
✦ కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
✦ జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం చాలా మంచిది. ఇందులో అధికశాతంలో ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
✦ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంటాయి.
✦ పచ్చి కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కొత్తిమీర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook