Beetroot Side Effects: బీట్‌రూట్ ఒక ఆరోగ్యకరమైన కూరగాయ. ఇది చూడడానికి ఎర్రగా ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్‌లు అధికంగా ఉంటాయి. చాలా మంది బీట్‌రూట్ తో వివిధ రకాల వంటలు, డిష్‌లు తయారు చేస్తుంటారు. అయితే బీట్ రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాం.
బీట్‌రూట్‌లో నైట్రేట్స్ రక్తనాళాలను విస్తరింపజేసి శక్తి ఉంటుంది. దీని వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు బీట్‌రూట్‌తో సలాడ్ చేసుకొని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బీట్‌రూట్ తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. జీమ్, వ్యాయామం చేసేవారు కూడా బీట్ రూట్ జ్యూస్ లేదా బీట్ రూట్ ముక్కలు తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుంది. బీట్ రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను తొలగించడంలో మేలు చేస్తాయి. బీట్‌రూట్ చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది.
బీట్ రూట్‌ను ఎలా తీసుకోవాల్సి ఉంటుంది:
సలాడ్‌లు:
బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కోసి ఇతర కూరగాయలతో కలిపి సలాడ్‌లు చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్, ఉల్లిపాయ, క్యాబేజ్ వంటివి కలపవచ్చు. దీనికి నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వంటి డ్రెస్సింగ్‌లు వేసి తీసుకోవచ్చు.
జ్యూస్:
బీట్‌రూట్‌ను జ్యూస్ చేసి తాగవచ్చు. ఇందులో క్యారెట్, ఆపిల్ వంటి ఇతర పండ్లను కూడా కలపవచ్చు.
సూప్‌లు:
బీట్‌రూట్‌ను ఉడికించి సూప్‌లు చేసుకోవచ్చు. ఇందులో కొన్ని మసాలాలు, కూరగాయలు కలిపి రుచికరమైన సూప్‌లు చేసుకోవచ్చు.
వేపుడు:
బీట్‌రూట్‌ను ఉడికించి వేపుడు చేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ, మిరియాల పొడి, కారం పొడి వంటి మసాలాలు వేసి వేపుడు చేసుకోవచ్చు.
పచ్చడి:
బీట్‌రూట్‌ను ఉడికించి పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర, కారం, నిమ్మరసం వంటివి కలిపి పచ్చడి చేసుకోవచ్చు.
వెజిటేబుల్ బర్గర్స్:
బీట్‌రూట్‌ను ఉడికించి వెజిటేబుల్ బర్గర్స్‌లో ఉపయోగించవచ్చు.
అయితే బీట్ రూట్ ఆరోగ్యకరమైన ఆహార అయినప్పటికి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం దీని తీసుకోవడం మంచిది కాదు. బీట్ రూట్ తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు:
బీట్‌రూట్‌లోఆక్సాలేట్‌లు ఉంటాయి. ఇవి మూత్రపిండాలలో రాళ్ళను ఏర్పరచే అవకాశం ఉంది. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌ను తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
అలెర్జీలు ఉన్నవారు:
కొంతమందికి బీట్‌రూట్‌కు అలెర్జీ ఉండవచ్చు. ఇలాంటి వారికి చర్మం ఎరుపుగా మారడం, దురద, వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
కడుపు సమస్యలు ఉన్నవారు:
అధికంగా బీట్‌రూట్ తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు ఉబ్బరం, మలబద్ధకం లేదా విరేచనం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గుండె జబ్బులు ఉన్నవారు:
అధిక రక్తపోటు ఉన్నవారు లేదా గుండె జబ్బులు ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్‌ను తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
గర్భవతులు పాలిచ్చే తల్లులు:
గర్భవతులు, పాలిచ్చే తల్లులు బీట్‌రూట్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరంలోని ఐరన్ స్థాయిలను పెంచి, శిశువుకు హాని కలిగించే అవకాశం ఉంది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే తప్పకుండా వైద్యునిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.