Bathing with Salt Water: ఉప్పునీటితో తలస్నానం.. కీళ్ల నొప్పులు మటు మాయం!

Bathing with Salt Water:  నీళ్లలో ఉప్పు కలిపి తలస్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దీని వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 04:57 PM IST
Bathing with Salt Water: ఉప్పునీటితో తలస్నానం.. కీళ్ల నొప్పులు మటు మాయం!

Bathing with Salt Water Benefit: సీజన్ ప్రకారం, చాలా మంది వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని మీలో ఎంతమందికి తెలుసు. సాల్ట్ వాటర్ తో స్నానం చేయడం (Bathing with Salt Water ) వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.  అంతే కాకుండా ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులకు చెక్
ఉప్పునీరు కూడా కీళ్ల నొప్పులను (joint pain) తగ్గిస్తుంది. తలస్నానం చేసేటప్పుడు నీళ్లలో చిటికెడు ఉప్పు కలిపి రాసుకుంటే ఎముకల్లో చిన్నపాటి నొప్పులు పోతాయి. అది కాకుండా, మీ పాదాల నొప్పి ఉంటే గోరువెచ్చని ఉప్పు నీటితో కడుక్కోవడం ద్వారా ఖచ్చితమైన ప్రయోజనాన్ని పొందుతారు.

ఇన్ఫెక్షన్ దరిచేరదు
ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగించడానికి ఉప్పునీరు చాలా ఉపయోగపడుతుంది. నిజానికి, ఉప్పులో ఉండే మినరల్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తాయి. 

మొటిమలకు చెక్
మొటిమలను వదిలించుకోవడానికి ఉప్పునీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల రంద్రాలు తెరుచుకుంటాయి, ఆ తర్వాత శరీరంలోని మురికి సులభంగా బయటకు వస్తుంది. ఇలా చేస్తే బాడీ డిటాక్స్ వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. దీనితో పాటు, ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది. 

ఒత్తిడి తక్కువగా ఉంటుంది
మీరు ఏదైనా విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే, మీరు ఖచ్చితంగా ఉప్పు నీటితో స్నానం చేయాలి. మీరు దీని నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఉప్పు నీటిలో ఉండే మినరల్స్ శరీరంలో శోషించబడతాయి. సోడియం మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఇది కాకుండా, శరీరం డిటాక్స్ చేసినప్పుడు శరీరం యొక్క ఒత్తిడి కూడా విడుదల అవుతుంది. తద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు.

Also Read: Hair Fall: హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే...వీటిని ఆహారంలో చేర్చుకోండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News