Kidney Problems : ఈ రెండు పదార్థాలు తింటున్నారా.. మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ తప్పవు

Kidney Damaging Food: మన శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పని చేయాలి అంటే.. మనం పౌష్టికాహారం తీసుకోవాలి. ఆహారపు అలవాట్లలో ఎటువంటి తేడా వచ్చినా.. మన ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా రెండు ఆహార పదార్థాలు తినడం వల్ల.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 30, 2024, 05:52 PM IST
Kidney Problems : ఈ రెండు పదార్థాలు తింటున్నారా.. మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ తప్పవు

Kidney Problems Diet : ఈ బిజీ బిజీ జీవితంలో.. ఆకలి చంపుకోవడానికి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ శరీరంలోకి వెళ్లే ప్రతి పదార్థం.. ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.. అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మనం తినే తిండి పైనే మన కిడ్నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం మంచి ఆహారం తింటే.. మన కిడ్నీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి. కానీ మన ఆహారపు అలవాట్లలో ఏదైనా పెద్ద మార్పులు వస్తే.. ముందుగా ప్రభావితం అయ్యేది మన కిడ్నీలే. 

కిడ్నీలు మన శరీరంలోని చెడుని నియంత్రిస్తాయి. ఉదాహరణకి రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడేది కిడ్నీలే. మరి అలాంటి కిడ్నీలను కాపాడుకోవడానికి మనం కొన్ని ఆహారపు అలవాట్లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఉప్పు, చక్కెర, మాంసం ఎక్కువగా తీసుకుంటే.. మూత్రపిండాలపై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దానివల్ల రక్త పోటు, డయాబెటిస్ వంటి పరిస్థితులు రావచ్చు. ఇలానే ఉంటే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. 

పండ్లు, కూరగాయలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం తిన్న ఆహారం సులభంగా అరిగిపోతుంది. కాబట్టి మూత్రపిండాలపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండదు. మన కిడ్నీల పనితీరుని.. మనం తీసుకునే ఆహారంలో ఉన్న చక్కెర, ప్రోటీన్స్ ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ రెండిటి శాతం రోజు చూసుకుంటా ఉండడం మంచిది.
ముఖ్యంగా మనం తినే ఆహారంలో.. సోడియం కంటెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ కూడా మరీ ఎక్కువ అవ్వకూడదు. అప్పుడే మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి.

వీలైనంతవరకు ఉప్పు, చక్కెరకి దూరంగా ఉంటే.. మన కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. మనం తినేది సులువుగా అరిగిపోయే పౌష్టిక ఆహారం అయితే మన కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి. జీర్ణక్రియలో భాగంగా ఉప్పు, చక్కెరను జీర్ణించుకోవడానికి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆ రెండిటికీ దూరంగా ఉంటే.. ఎంత కాలమైనా మనం కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఇక ఈ రెండిటినీ దూరం పెట్టడంతో పాటు రోజూ తగినంత మంచినీళ్లు కూడా తాగడం అత్యంత అవసరం. మన శరీరంలోని వ్యర్ధాలను శుభ్రపరచడానికి.. మూత్రపిండాలు బాగా పనిచేయడానికి.. మంచి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News