Sweating Reasons: ప్రతిరోజూ మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కొన్ని సాధారణమే కావచ్చు గానీ ప్రాణాంతక వ్యాధులకు సూచనలవుతాయి. ముఖ్యంగా రాత్రిళ్లు చెమటలు పడితే అదే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
శరీరంలో జరిగే ప్రతి మార్పుకు ఓ కారణముంటుంది. ఆ కారణాలు ఒక్కోసారి సాధారణం కావచ్చు..చాలా సందర్భాల్లో సీరియస్ కావచ్చు. ఇబ్బంది ఎదురైనప్పుడు వైద్యుని సంప్రదిస్తే ఎందుకనేది తెలుసుకోవచ్చు. లైట్‌గా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఎందుకంటే ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలు ఒక్కోసారి సాధారణంగానే ఉంటుంటాయి.
ఆధునిక ఆహారపు అలవాట్లు, పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాలు అనాలోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. శరీరంలో నిరంతరం జరిగే మార్పుల కారణంగా కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఇందులో కొన్ని లక్షణాలు సాధారణమే అయినా కొన్ని మాత్రం ప్రమాదకర వ్యాధులకు సంకేతాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే మనకు ఎదురయ్యే అన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రతి మనిషికి చెమట పట్టడం సహజం. ఆ చెమట వేడి వల్ల కావచ్చు, ఉక్కపోత వల్ల కావచ్చు, శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పుల వల్ల కావచ్చు. కారణమేదైనా చెమట్లు పట్టినప్పుడు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రాత్రిపూట చెమట పట్టడమనేది ప్రమాదకర వ్యాధికి సంకేతమంటున్నారు వైద్యులు.
అదే పగటి పూట చెమటలొస్తే ఆరోగ్యానికి మంచిదే. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలకు రాత్రి పూట చెమటలు పడుతుంటాయి. అయితే రాత్రి పూట చెమటలు మరో కారణం కూడా ఉంటుంది. ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ కారణంగా అకారణంగా చెమటలు పడుతుంటాయి రాత్రిపూట. ఇక క్షయ వ్యాధి ఉన్నవారికి కూడా రాత్రి పూట చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. ఎండో కార్డిటిస్, ఆప్టియోమైలిటిస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి కూడా రాత్రి సమయంలో చెమటలు అధికంగా వస్తుంటాయి. అటు హెచ్ఐవీ బాధితులకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
కేన్సర్‌కు సంకేతమా చెమట్లు పట్టడం
మరీ ముఖ్యంగా లింఫోమా వంటి కొన్ని కేన్సర్ వ్యాదులకు చెమటలు పట్టడం ప్రారంభ లక్షణం. మనం వివిధ సమస్యల కారణంగా తీసుకునే మందుల వల్ల కూడా కొన్నిసార్లు చెమటలు పడుతుంటాయి. ఆస్పిరిన్, ఎసిటమినోపైన్ వంటి జ్వరాన్ని తగ్గించే మాత్రలతో కూడా చెమటలు పడతాయి.
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు. మధుమేహాన్ని నియంత్రించే మందుల వల్ల కూడా రాత్రిళ్లు చెమటలు పడుతుంటాయి. ఇక కార్సినోయిడ్ సిండ్రోమ్, ఫిరయోక్రోమోసైటోమా, హైపర్ థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యలున్నవారికి రాత్రి సమయంలో పెద్దఎత్తున చెమటలు పడతాయి. అందుకే సాధ్యమైనంతవరకూ చెమటలు పట్టినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిది.
Also read: Muscle Cramps Pain: మజిల్ క్రాంప్ పెయిన్ అంటే ఏంటి, ఎక్కడ వస్తుంది, ఉపశమనం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook