/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Appetite Loss: ఆకలి, నిద్ర మనిషికి చాలా అవసరం. తగిన మోతాదులో తప్పకుండా ఉండాలి. ఆకలి తగ్గడానికి కారణం పోషక పదార్ధం లోపమే. ఆ వివరాలు మీ కోసం..

ఎపెటైట్ అంటే ఆకలి లేకపోవడమనే సమస్య సాధారణంగా చిన్న పిల్లల్లో లేదా ఓ వయస్సు దాటాక ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం నేరుగా శరీరంపై పడుతుంది. దాంతో ఏ చిన్న పని చేసినా వెంటనే ఆలసిపోతుంటారు. బరువు కూడా గణనీయంగా తగ్గుతుంటుంది. ఈ పరిస్థితుల్లో తిరిగి కోలుకోకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. లేకుంటే క్రమంగా బలహీనపడిపోతారు. ఇలా ఆకలి తగ్గడానికి ప్రధాన కారణం జింక్ లోపమంటున్నారు వైద్య నిపుణులు..

జింక్ ఎందుకు అవసరం

మనిషి శరీరానికి జింక్ ఒక ప్రత్యేకమైన న్యూట్రియంట్. ఇది శరీరానికి చాలా అవసరం. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచేందుకు, చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచేందుకు దోహదపడుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆకలి లేమి నుంచి ఉపశమనం పొందాలంటే...జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.

జింక్ లోపముంటే కన్పించే లక్షణాలు

జింక్ లోపంతో ఆకలి లేమి, బరువు తగ్గడం, బలహీనత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, డయేరియా, హెయిర్ ఫాల్, గాయాలు ఆలస్యంగా మానడం, రుచి, వ్యర్ధాలకు తేడా తెలియకపోవడం

జింక్ లోపాన్ని సరిజేసే ఆహారం

పెరుగు హెల్తీ డైట్ అని అందరికీ తెలుసు.పెరుగు వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు శరీరంలో జింక్ కొరత దూరమౌతుంది. జీడిపప్పు ఆరోగ్యానికి చాలా బలవర్దకమైన ఆహారం. ఇందులో జింక్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ కే, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. తెల్ల శెనగల్లో కూడా జింక్ తగిన మోతాదులో ఉంటుంది. జింక్‌తో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తెల్ల శెనగలు తినడం శరీరంలో జింక్ లోపం పోతుంది. పుచ్చకాయ విత్తనాల్లో సైతం జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది. 

Also read: LOW BP Reasons: లో బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారా, ఇలా చేయండి చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Appetite loss reasons and precautions, main reason for appetite, why did children face this problem
News Source: 
Home Title: 

Appetite Loss Reasons: ఆకలి ఎందుకేయడం లేదు, చిన్నారుల్లో ఎక్కువగా ఈ సమస్య

Appetite Loss Reasons: ఆకలి ఎందుకేయడం లేదు, చిన్నారుల్లో ఎక్కువగా ఈ సమస్య
Caption: 
Zinc Deficiency ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Appetite Loss Reasons: ఆకలి ఎందుకేయడం లేదు, చిన్నారుల్లో ఎక్కువగా ఈ సమస్య
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, September 24, 2022 - 22:30
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
87
Is Breaking News: 
No