/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Dieting: ఆధునిక జీవనశైలిలో దాదాపు చాలామందిలో ప్రధానంగా కన్పించే సమస్య అధిక బరువు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా పాటిస్తుంటారు. ఇప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గుతారంటున్నారు వైద్య నిపుణులు.

సాధారణంగా బరువు తగ్గాలంటే డైటింగ్ చేయాలి లేదా గ్రీన్ టీ సేవనం, లేదా తప్పనిసరిగా వ్యాయామం. ఇప్పుడు ఇది సరికొత్త ప్రక్రియ. డైటింగ్, వ్యాయమం చేసినా సరే బరువు తగ్గకపోతే..ఈ చిట్కాలు పాటించాల్సిందే. కొన్ని రకాల మసాలా దినుసుల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రుచి పెరగడమే కాకుండా బరువు వేగంగా తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కచ్చితంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఎలా, ఏంటనేది పరిశీలిద్దాం.

ప్రధానంగా జీలకర్ర. ఇళ్లలో ప్రతిరోజూ వాడేదే. జీలకర్ర శరీర బరువున తగ్గించడంలో దోహదపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని జీలకర్ర మార్చగలుగుతుంది. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు రోజూ జీలకర్ర నీటిని లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చడం ద్వారా బరువు తగ్గుతారు. ఇక మరో ప్రధాన సుగంధ ద్రవ్యం..దాల్చిన చెక్క. శరీరంలోని చక్కెరను ప్రాసెస్ చేసేది దాల్చిన చెక్కే. శరీరంలో ఉండే షుగర్..కొవ్వుగా మారకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుంది. దాల్చిన చెక్క కారణంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 

ఇక మరో ముఖ్యమైంది నల్లమిరియాలు. శరీరంలో కొవ్వు కణాల ప్రక్రియను నిరోధిస్తాయి. ఎండుమిర్చి తినడం వల్ల కూడా కొవ్వు సంబంధిత సమస్యలు తలెత్తవు. తరచూ పెప్సీ టీ తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ దూరమౌతాయి. నల్ల మిరియాల్ని వివిధ రకాల ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు. మరో సుగంధ ద్రవ్యం యాలుక్కాయలు. జీర్ణక్రియకు ఇవి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. జీవక్రియను పెంచడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. యాలుక్కాయల్ని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి మంచిదే. 

ఇక బెస్ట్ యాంటీ బయోటిక్‌గా చెప్పుకునే పసుపు. పసుపు లేకుండా భారతీయ వంటలుండవు. పూర్తి ఆయుర్వేద గుణాలున్న పుసుపుతో శరీరంలో మంటలు వంటివి దూరమౌతాయి. పసుపు వివిధ రకాల విషపదార్ధాల్నించి మనల్ని కాపాడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. 

Also read: Weight Gain Tips: బరువు పెరిగేందుకు ఐదు సులభమైన మార్గాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Add these spices to your daily food to reduce over weight along with exercises
News Source: 
Home Title: 

Dieting: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఇవి తప్పకుండా తినండి

 Dieting: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఇవి తప్పకుండా తినండి
Caption: 
Spices ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Dieting: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఇవి తప్పకుండా తినండి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, March 16, 2022 - 09:26
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
57
Is Breaking News: 
No