బేబీ సినిమాతో ఆకట్టుకోనున్న యంగ్ హీరో విరాజ్ అశ్విన్‌

యంగ్ హీరో విరాజ్ అశ్విన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ - విరాజ్ అశ్విన్‌ నటించిన బేబీ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఆ వివరాలు మీ కోసం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2023, 06:54 PM IST
బేబీ సినిమాతో ఆకట్టుకోనున్న యంగ్ హీరో విరాజ్ అశ్విన్‌

"అనగనగా ఓ ప్రేమ కథ" సినిమాతో యంగ్ హీరో విరాజ్ అశ్విన్‌ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసందే! మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన విరాజ్ అశ్విన్‌ 'థ్యాంక్యూ బ్రదర్‌'తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పడింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో   విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. 

ప్రముఖ ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. "మనసనమహ" అనే షార్ట్ ఫిల్మ్ తోనే టాలీవుడ్ లో సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్ (513 అవార్డులు)గా గిన్నిస్ రికార్డ్ సాధించింది. అయితే తాజాగా హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి బేబీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మన యంగ్ హీరో విరాజ్ అశ్విన్‌. 

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్‌కి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే!. ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ కి కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. ఈ సినిమా తన సినీ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వనుందని యాంగ్ హీరో విరాజ్ అశ్విన్ భావిస్తున్నాడు. ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్.. స్క్రీన్ ప్రజెన్స్ లో కూడా ఆహా అనిపించాడు. నటనలోనే కాకుండా.. పాటల్లో కూడా టాలెంట్ ని చూపించాడు. ట్రైలర్ లాంచ్‌ సమయంలో "చాక్లెట్ బాయ్ లుక్స్" అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ ప్రశంసించారు.

Also Read: Srikalahasti Road Accident: శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు దుర్మరణం  

బేబీ ట్రైలర్‌ను చూస్తుంటే.. విరాజ్‌ అశ్విన్ పాత్ర చాలా కీలకమైనదిగా అర్థమవుతోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయితే మరి కొన్ని క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మేలో మాయపేటికతో ఆడియన్స్ ముందుకు రాగా.. ప్రస్తుతం బేబీతో పాటు మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విరాజ్ అశ్విన్ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు.

Also Read: Realme Gt Neo 6 Pro: అదిరిపోయే లుక్‌తో Realme నుంచి మరో రెండు స్మార్ట్‌ ఫోన్స్‌..ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News