రాముడి నేస్తానికి కేరళలో పార్కు కట్టారట

రామాయణంలోని అరణ్యకాండలో మనం జటాయువు గురించి వినే ఉంటాం. జటాయువు ఒక గ్రద్ధ పేరు. రాముడికి గొప్ప స్నేహితుడిగా మెలిగిన ఈ గ్రద్ధ ఆయనకు నమ్మకంగా ఉండేదని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

Last Updated : May 19, 2018, 03:31 PM IST
రాముడి నేస్తానికి కేరళలో పార్కు కట్టారట

రామాయణంలోని అరణ్యకాండలో మనం జటాయువు గురించి వినే ఉంటాం. జటాయువు ఒక గ్రద్ధ పేరు. రాముడికి గొప్ప స్నేహితుడిగా మెలిగిన ఈ గ్రద్ధ ఆయనకు నమ్మకంగా ఉండేదని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడు సీతాదేవిని మభ్యపెట్టి లంకా నగరానికి తీసుకెళ్తున్నప్పుడు జటాయువు ఎదిరించి పోరాడుతుంది. ఫలితంగా రావణుడు దాని రెక్కలను తెగనరుకుతాడు.

జటాయువు నేల మీద పడిపోతుంది. అలాంటి సందర్భంలో జటాయువు త్యాగానికి చలించిపోయిన శ్రీరాముడే దానిని గుండెలకు హత్తుకున్నాడని.. దహన సంస్కారాలను దగ్గరుండి చేయించాడని అంటారు. అయితే జటాయువు రెక్కలను నరికాక.. అవి కేరళలోని కొల్లాం జిల్లాకు దూరంగా ఉన్న చాడాయమంగళం అనే  ప్రాంతంలో పడ్డాయని.. ఆ ప్రదేశాన్నే జటాయుమంగళం అంటారని ప్రతీతి. 

ఇటీవలే కేరళ ప్రభుత్వం కొల్లాంలో జటాయువు పేరు మీద ఒ థీమ్ పార్క్ కట్టింది.  దాదాపు 100 కోట్ల రూపాయలతో ఆ పార్కు నిర్మించారట. అడ్వెంచర్ పార్కుగా ప్రసిద్ధి గాంచిన ఆ పార్కునే జటాయు ఎర్త్ సెంటర్ లేదా జటాయు నేచర్ పార్కు అంటారు. 6డీ థియేటర్, కేబుల్ కార్, డిజిటల్ మ్యూజియం, అడ్వెంచర్ జోన్, కేవ్ రిసార్ట్ లాంటి ప్రత్యేకతలెన్నో ఆ పార్కులో ఉన్నాయి.

దుబాయి టూరిజం కార్పొరేషను కూడా ఈ పార్కులో పెట్టుబడులు పెట్టింది. చిత్రమేంటంటే.. ఆ పార్కు కూడా జటాయువు ఆకారంలోనే చాలా వైవిధ్యంగా ఉంటుంది. సీతాదేవిని జటాయువు రక్షించింది కాబట్టి మహిళల భద్రతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆ పార్కుని డిజైన్ చేశారట.

Trending News