బీహార్‌లోని ఓ ఆసుపత్రిలో గాయాలతో చేరిన ఓ మహిళకు సర్జరీ చేయాల్సిన సమయంలో టార్చిని ఉపయోగించారు వైద్యులు. ఆ టైమ్‌కి ఆసుపత్రిలో విద్యుత్ పోవడమే అందుకు ప్రధాన కారణం. పోనీ.. జనరేటర్ అయినా ఉందా.. అంటే అదీ లేకపోవడంతో అత్యవసర పరిస్థితి కాబట్టి.. టార్చి లైటు ఉపయోగించి ఆపరేషన్ చేశామని అంటున్నారు డాక్టర్లు. అయితే ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారమే రేపింది.
వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలు మీడియా సంస్థలు వార్తలు కూడా రాశాయి. ఈ సంఘటనకు చెందిన ఫోటోలు బయటకు లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పరిస్థితి విషమించింది. సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రే ఎంక్వయిరీ వేస్తామని.. ఈ పని చేసిన వారిని క్షమించేది లేదని తెలిపారు. అయితే ఫోటోల్లో తెల్లటి దుస్తులు ధరించకుండా.. మూమూలు దుస్తుల్లో డాక్టర్లు వైద్యం చేయడాన్ని కూడా చాలామంది తప్పు పట్టారు. వారు డాక్టర్లని గ్యారెంటీ ఏమిటని కూడా ప్రశ్నించారు. సహర్స ప్రాంతంలోని సాదర్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది
#WATCH: A woman is operated upon in torch light at Sadar Hospital in Saharsa as there was no electricity at that time in the hospital. #Bihar pic.twitter.com/HN6T5I2683
— ANI (@ANI) March 19, 2018