కత్తి మహేష్ నోటి వెంట శ్రీరాముడి శ్లోకం.. క్షమించేసిన పరిపూర్ణానంద

సినీ క్రిటిక్ కత్తి మహేష్ శ్రీరాముడిని కీర్తిస్తూ పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కత్తి మహేష్ పశ్చాత్తాపం పొందాడని కొందరు అంటే.. అవన్నీ దొంగ వేషాలు అంటూ మరికొంతమంది నెటిజన్లు స్పందించారు.

Last Updated : Jul 14, 2018, 03:29 PM IST
కత్తి మహేష్ నోటి వెంట శ్రీరాముడి శ్లోకం.. క్షమించేసిన పరిపూర్ణానంద

సినీ క్రిటిక్ కత్తి మహేష్ శ్రీరాముడిని కీర్తిస్తూ పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కత్తి మహేష్ పశ్చాత్తాపం పొందాడని కొందరు అంటే.. అవన్నీ దొంగ వేషాలు అంటూ మరికొంతమంది నెటిజన్లు స్పందించారు. అయితే ఈ  వీడియో బయటకు వచ్చాక.. స్వామి పరిపూర్ణానంద నుండి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది.

"కత్తి మహేష్‌ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మహేష్ బోయవాడిగా మాట్లాడినా.. వాల్మీకిగా మారగల శక్తి తనకు ఉంది" అని పరిపూర్ణానంద మహేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే భారత సంస్కృతిని ప్రభుత్వమే రక్షించాలని.. హిందూ సంప్రదాయాలను, విలువలను తెలిపే విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చోటుచేసుకోవాలని పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు. 

శ్రీరాముడి పై ఈ మధ్యకాలంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో పెద్ద దుమారమే రేపాయి. కత్తి మహేష్ హైదరాబాద్‌లో ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించిన డీజీపీ ఆయనను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే పరిపూర్ణానంద కూడా గతంలో కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని చెబుతూ.. ఆయనను కూడా నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ క్రమంలో పరిపూర్ణానందను కూడా బహిష్కరించడంపై తన వ్యతిరేకతను తెలియజేస్తూ.. కత్తి మహేష్ పోస్టులు పెట్టారు. 

Trending News