Vijay Devarakonda: దేవరకొండతో డేటింగ్ చేయలనుందన్న సారా.. విజయ్ షాకింగ్ రిప్లై!

Vijay Devarakonda Comments on Sara Alikhan: తనకు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని సారా అలీ ఖాన్ పేర్కొనగా దానికి విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 02:19 PM IST
  • విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయలనుందన్న సారా
  • కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సారా
  • ఆసక్తికరంగా స్పందించిన విజయ్
Vijay Devarakonda: దేవరకొండతో డేటింగ్ చేయలనుందన్న సారా.. విజయ్ షాకింగ్ రిప్లై!

Vijay Devarakonda Comments on Sara Alikhan: చేసిన అతి తక్కువ సినిమాలతోనే విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. నువ్విలా అనే సినిమాతో రవిబాబు దర్శకత్వంలో నటుడిగా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. పెళ్లిచూపులు సినిమాతో ఓ మాదిరి హిట్టు అందుకున్నాడు. ఆ సినిమా మంచి పేరు తీసుకురాగా అర్జున్ రెడ్డి సినిమా మాత్రం ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన టాక్సీవాలా,  గీతగోవిందం వంటి సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలవడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

అయితే ఆ తర్వాత ఆయన చేసిన డియర్ కామ్రేడ్,  వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు నిరత్సాహపరిచినా ఆయన క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతూ ఉండడంతో నిత్యం అన్ని భాషల్లో కూడా విజయ్ దేవరకొండ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ విజయ్ మీద ముందు నుంచి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.

తనకు విజయ్ అంటే ఇష్టం అని పలు సందర్భాల్లో జాన్వీ కపూర్ బయట పెట్టింది. ఇప్పుడు తాజాగా తనకు కూడా విజయ్ అంటే ఇష్టం అంటూ ఆమె స్నేహితురాలు మరో స్టార్ డాటర్ అయిన సారా అలీఖాన్ కూడా బయటపెట్టింది. కరణ్ జోహార్ ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక ఎపిసోడ్లో సారా అలీ ఖాన్,  జాన్వీ కపూర్ కలిసి హాజరయ్యారు. అందులో భాగంగా మీకు ఎవరితో డేటింగ్ చేయాలని ఉంది అని సారా అలీఖాన్ ను ప్రశ్నిస్తే తొలుత ఆమె ఎలాంటి సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపించలేదు కానీ చివరికి విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ కామెంట్ చేసింది.

అయితే జాన్వికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అనే సంగతి మీకు తెలుసా అంటే ఇద్దరూ నవ్వేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సారా అలిఖాన్ కామెంట్స్ కి విజయ్ దేవరకొండ స్పందించాడు. తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీ షేర్ చేసిన విజయ్ దేవరకొండ మీరు దేవరకొండ అని పలికిన విధానం భలే క్యూట్ గా ఉంది సారా,  మీకు నా ప్రేమ, కిస్సెస్ పంపిస్తున్నాను అంటూ ఆయన పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Gangavva: గంగవ్వా మజాకా.. ఆమె కోసం స్పెషల్ క్యారవాన్.. ఆ రెంజే వేరబ్బా!

Also Read: Kalyan Dev: విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. దాని గురించేనా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News