కవచం: వస్తావా పిల్లా పాటలో తన డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించిన సాయి శ్రీనివాస్

Last Updated : Dec 4, 2018, 07:14 PM IST
కవచం: వస్తావా పిల్లా పాటలో తన డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించిన సాయి శ్రీనివాస్

సాక్ష్యం సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమా కవచం. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన కవచం ట్రైలర్‌కి సైతం మంచి స్పందన కనిపించింది. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ చౌదరి సొంటినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించగా అతడి సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్స్‌గా నటించారు. కవచం విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా నిర్మాతలు ఈ సినిమా నుంచి వస్తావా పిల్లా అనే పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు. 

ఒక సినిమా నుంచి మరొక సినిమాకు తన పర్‌ఫార్మెన్స్‌ను ఇంప్రూవ్ చేసుకునేందుకు యత్నిస్తున్న సాయి శ్రీనివాస్ ఈ పాటలో తన డ్యాన్సింగ్ స్కిల్స్ సైతం చూపించుకునే ప్రయత్నం చేశాడని ఈసాంగ్ వీడియో ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మరోవైపు ఈ పాటలో సాయి శ్రీనివాస్ సరసన స్టెప్పులేస్తూ కనిపించిన మెహ్రీన్ ఫిర్జాదా తన గత చిత్రాలకన్నా ఈ సినిమాలో ఇంకాస్త బొద్దుగా తయారైనట్టు కనిపించింది. 

 

Trending News