Priyanth Rao Wife Hulchul: రేప్ కేసులో హీరో అరెస్ట్.. భర్తను దోమలు కుడతాయంటూ భార్య రచ్చ!

Tollywood Hero Priyanth Rao Wife Hulchul : టాలీవుడ్ హీరో ప్రియాంత్ రావు రేప్ కేసులో అరెస్ట్ కాగా అతని భార్య పోలీసు స్టేషన్ వద్ద హల్చల్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 14, 2022, 03:40 PM IST
Priyanth Rao Wife Hulchul: రేప్ కేసులో హీరో అరెస్ట్.. భర్తను దోమలు కుడతాయంటూ భార్య రచ్చ!

Tollywood Hero Priyanth Rao Wife Hulchul at Police Station: కొద్దిరోజుల క్రితం రేప్ కేసులో తెలుగు వర్ధమాన హీరో ప్రియాంత్ రావుని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ‘’కొత్తగా మా ప్రయాణం’’ అనే సినిమాతో ప్రియాంత్‌ రావు తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమా షూటింగ్ లోనే అతనికి ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ప్రేమ పేరుతో ఆమెను నమ్మించిన ప్రియాంత్ రావుని ఒకరోజు హైదరాబాద్ శివార్లలోని హరిత రిసార్ట్ కి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం జరిపాడు.

 ఆ తర్వాత కూడా పలు దఫాలుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశారు. ఇటీవల ఆమెకు గర్భం రావడంతో ఆ గర్భ శ్రావణ జరగడం కోసం కొన్ని మందులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మందుల వల్ల సదరు జూనియర్ ఆర్టిస్ట్ అనారోగ్యం పాలైంది. తర్వాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంతో ఆమె జూన్ 9వ తేదీన హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంత్ రావు ఇటీవల పోలీసులకు చిక్కడంతో అరెస్ట్ చేశారు.

అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది కొద్ది రోజుల నుంచి ప్రియాంత్ రావుని లాకప్ లో ఉంచి పోలీసులకు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని అతని భార్య పోలీస్ స్టేషన్కు ఏకంగా అతను వాడే కార్వాన్ తీసుకొచ్చింది. రాత్రిపూట దోమల వల్ల తన భర్తకు నిద్ర పట్టడం లేదని, అందువల్ల లాక్ అప్ లో కాకుండా కార్వాన్ లో ఉండే అవకాశం కల్పించాలని పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ సృష్టించింది.

తన భర్తకు దోమలు, ఈగలతో ఇబ్బంది ఉంటుందని అలాగే వేడి తట్టుకోలేరని చెబుతూ ఆమె పోలీసు స్టేషన్ ముందు హల్చల్ సృష్టించగా పోలీసులు అలా ఉంచడానికి రూల్స్ ఒప్పుకోమని చెబుతూ ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. ఇక ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రియాంత్ రావు మీద కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు బయటకు వెల్లడించలేదు.

Also Read: Sravanthi Chokarapu Hot Pics: క్లీవేజ్ షోతో స్రవంతి పరువాల విందు.. హద్దులు చెరిపేస్తోందిగా!

Also Read: Rashmika Mandanna Hot Photos: ఫాన్స్ కి రష్మిక ఫుల్ మీల్స్.. ఎద అందాలన్నీ ఆరబోస్తూ రచ్చ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News