"హలీమ్" వంటకం ఎలా పుట్టిందో తెలుసా..!

రంజాన్ మాసంలో "హలీమ్" రుచులు ముస్లిములతో పాటు అనేకమంది ముస్లిమేతరులను కూడా ఆస్వాదింపజేస్తాయనడంలో సందేహం లేదు. అయితే హలీమ్ అనే పదం వెనుక కూడా ఓ ప్రాచీన చరిత్ర ఉందండోయ్. అదేంటో మనం కూడా తెలుసుకుందామా..!

Last Updated : Jun 7, 2018, 05:51 PM IST
"హలీమ్" వంటకం ఎలా పుట్టిందో తెలుసా..!

రంజాన్ మాసంలో "హలీమ్" రుచులు ముస్లిములతో పాటు అనేకమంది ముస్లిమేతరులను కూడా ఆస్వాదింపజేస్తాయనడంలో సందేహం లేదు. అయితే హలీమ్ అనే పదం వెనుక కూడా ఓ ప్రాచీన చరిత్ర ఉందండోయ్. అదేంటో మనం కూడా తెలుసుకుందామా..!

*హలీమ్ అనే పదం "హరీస్" అనే అరబ్ వంటకం నుండి పుట్టింది. అంటే హలీమ్ వంటకానికి పునాదులు "హరీస్"లో ఉన్నాయన్న మాట. 

*ప్రముఖ రచయిత షోయబ్ దనియాల్ హలీమ్ గురించి చెబుతూ క్రీ.శ 10వ శతాబ్దంతో తొలిసారిగా ఈ వంటకాన్ని తయారుచేశారని తెలిపారు.

*అబు మహమ్మద్ అల్ ముజఫర్ అనే ప్రముఖ అరేబియన్ చెఫ్ బాగ్దాద్ పట్టణంలో రాజవంశీయులు తినే వంటకాల జాబితాను తొలిసారిగా పుస్తక రూపంలో ప్రచురించారు. అందులో హరీస్ ప్రస్తావన ఉంది.

*"హరీస్" వంటకానికి సంబంధించిన తయారీ పద్ధతి పలువురు అరబ్ సైనికుల ద్వారా హైదరాబాద్ నిజాం సంస్థానంలో పనిచేసే సైనికుల వద్దకు చేరింది.

*ఇప్పటికీ హలీమ్ పుట్టడానికి కారణమైన అసలైన వంటకం "హరీస్" పాతబస్తీలో పలుచోట్ల తయారుచేస్తున్నారని వినికిడి.

*"హరీస్" వంటకం అనేక మార్పులు చేర్పులకు గురై.. ఆఖరికి ఆధునికతను కూడా సంతరించుకొని ప్రస్తుతం "హలీమ్"గా వినుతికెక్కింది.

*హలీమ్ తయారీలో గోధుమ రవ్వ, నెయ్యి, మటన్ లేదా పొట్టేలు మాంసం, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లి, కొత్తిమీర, పుదీనా మొదలైనవి ఉపయోగిస్తారు.

*నేడు హైదరాబాద్‌లో పిస్తా హౌస్, ప్యారడైజ్, కేఫ్ 555, హైదరాబాద్ హౌస్ లాంటివి హలీమ్ తయారీలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్ నుండి విదేశాలకు కూడా నేడు హలీమ్ ఎగుమతి అవుతోంది.

*స్వచ్ఛమైన హలీమ్ తయారీలో నాణ్యమైన సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తారు.

* దేశాల్లో తయారయ్యే హలీంలో నూనె ఉపయోగిస్తే..  హైదరాబాద్ హలీంలో మాత్రం నెయ్యి కూడా ఉపయోగించడం రివాజుగా వస్తోంది.

*సాధారణంగా హలీమ్ అంటే నాన్ వెజ్ వంటకమే. కానీ నేడు వెజ్ హలీమ్ కూడా మార్కెట్లో లభిస్తోంది.

*హలీమ్‌తో క్రైస్తవులకు కూడా సంబంధం ఉంది.  సిరియన్‌ క్రిస్టియన్లు చర్చిల వద్ద పేదలకు పంచి పెట్టడానికి హలీమ్ తయారుచేసేవారని కొన్ని పుస్తకాలు చెబుతున్నాయి.

*హలీమ్‌ను తొలిసారిగా భారతదేశంలో చార్మినార్ వద్దనున్న మదీనా హోటల్‌లో 1950వ సంవత్సరంలో విక్రయించారని రికార్డులు చెబుతున్నాయి.

Trending News