సైరా నర్సింహా రెడ్డి నుంచి తమన్నా ఫస్ట్ లుక్ మోషన్ టీజర్

సైరా నర్సింహా రెడ్డి నుంచి తమన్నా ఫస్ట్ లుక్ మోషన్ టీజర్

Last Updated : Dec 21, 2018, 04:25 PM IST
సైరా నర్సింహా రెడ్డి నుంచి తమన్నా ఫస్ట్ లుక్ మోషన్ టీజర్

మిల్కీ బ్యూటీ తమన్నా బర్త్ డే ఇవాళ. తమన్నా బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న ‘సైరా’ సినిమాలోని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ టీజర్‌ను విడుదల చేసి ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది ఆ చిత్ర యూనిట్. టీజర్‌తోపాటే సినిమాలో తమన్నా క్యారెక్టర్ పేరు కూడా వెల్లడించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150తో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి నిర్మాతగా మారాడు. టాలీవుడ్ మెగాస్టార్‌తోపాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగ్గూభాయ్ జగపతి బాబు, నయనతార, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఎందరో నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Trending News