"సైరా" సినిమాలో కిచా సుదీప్ లేటెస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ప్రేరణగా తీసుకొని నిర్మిస్తున్న చిత్రమే ‘సైరా నరసింహారెడ్డి’. 

Last Updated : Sep 1, 2018, 11:39 PM IST
"సైరా" సినిమాలో కిచా సుదీప్ లేటెస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ప్రేరణగా తీసుకొని నిర్మిస్తున్న చిత్రమే ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ఇదే చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్‌ ఓ ముఖ్యమైన క్యారెక్టర్ పోషిస్తున్నారనే సంగతి తెలిసిందే.

ఆదివారం కిచా సుదీప్‌ బర్త్ డే సందర్భంగా ‘సైరా’ చిత్రంలో సుదీప్ ఫస్ట్ లుక్‌ని నిర్మాతలు విడుదల చేశారు. ‘‘మా అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌కు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సైరా నరసింహారెడ్డిలోని ‘అవుకురాజు’ డైనమిక్‌ లుక్‌ మీకోసం’’ అని చెబుతూ సోషల్ మీడియాలో సుదీప్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో సుదీప్‌ ‘అవుకు రాజు’ పాత్రలో నటిస్తున్నారు.

"సైరా" చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా... అమితాబ్‌ బచ్చన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.  విజయ సేతుపతి, రవి కిషన్, హ్యుమా ఖురేషి, జగపతిబాబు, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా, ప్రగ్యా జైశ్వాల్ ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలు. ఈ చిత్రంలో పరుచూరి బ్రదర్స్ అందించిన కథకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.  200 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలుత ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉన్నా.. ఆ తర్వాత ఆయన డేట్స్ కుదరకపోవడం వల్ల తప్పుకోవడం జరిగింది. బాలీవుడ్ సంగీత ద‌ర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారని సమాచారం. 

Trending News