స్టార్ హీరో కొడుకు ధృవ్‌‌పై కేసు నమోదు

స్టార్ హీరో కొడుకు ధృవ్‌‌పై కేసు నమోదు

Last Updated : Aug 12, 2018, 10:45 AM IST
స్టార్ హీరో కొడుకు ధృవ్‌‌పై కేసు నమోదు

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ధృవ్ నడుపుతున్న కారు రోడ్డుపై నిలిచి ఉన్న మూడు ఆటోలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌కు కాలు విరిగిందని.. డైవర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ధృవ్ 'వర్మ(తెలుగులో అర్జున్ రెడ్డి)' అనే చిత్రంతో త్వరలోనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విక్రమ్ తన ఇన్‌స్టాగ్రమ్‌‌లో అర్జున్ రెడ్డి రీమేక్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ధ్రువ్‌ గడ్డంతో ఉన్న స్కెచ్‌ ఆకట్టుకుంటోంది.

 

YOU'RE GODDAMN RIGHT. #varmathemovie #dirbala #dhruvvikram #E4entertainment @Itsjosephjaxson

A post shared by Vikram (@the_real_chiyaan) on

 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో కూడా ధృవ్ ఓ ప్రాజెక్టు చేయనున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Trending News