ఎస్ఎస్ రాజమౌళి కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?

ఎస్ఎస్ రాజమౌళి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు

Last Updated : Sep 6, 2018, 06:00 PM IST
ఎస్ఎస్ రాజమౌళి కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?

ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. జక్కన్న కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇంతకీ రాజమౌళికి కాబోయే కోడలు ఎవరో తెలుసా ? ప్రముఖ సినీనటుడు జ‌గ‌ప‌తి బాబు సోద‌రుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్. అవును, ఈమేరకు ఇప్పటికే ఇరుకుటుంబాలు తాంబూలాలు సైతం మార్చుకున్నాయి. సమీప బంధుమిత్రులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో బుధవారం కార్తికేయ, పూజాలకు నిశ్చితార్థం జరిగింది. 

Trending News