Mahesh Babu: మహేష్ బాబుతో సినిమాపై రాజమౌళి క్లారిటీ

మహేష్ బాబు (Mahesh Babu) లాంటి సూపర్ స్టార్‌తో సంచలనాల దర్శకుడు రాజమౌళి ( SS Rajamouli) సినిమా అనే ఊహే అభిమానులకు ఎంతో కిక్కునిస్తుంది కదా!! అవును, అయితే చాలా కాలంగా వీళ్లిద్దకి కాంబోలో అసలు సినిమా వస్తుందా రాదా అనే ఉత్కంఠే మహేష్ బాబు, రాజమౌళి అభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది. అయితే, ఎట్టకేలకు మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే అంశంపై స్వయంగా రాజమౌళినే ఓ క్లారిటీ ఇచ్చాడు.

Last Updated : Apr 19, 2020, 05:51 AM IST
Mahesh Babu: మహేష్ బాబుతో సినిమాపై రాజమౌళి క్లారిటీ

మహేష్ బాబు (Mahesh Babu) లాంటి సూపర్ స్టార్‌తో సంచలనాల దర్శకుడు రాజమౌళి ( SS Rajamouli) సినిమా అనే ఊహే అభిమానులకు ఎంతో కిక్కునిస్తుంది కదా!! అవును, అయితే చాలా కాలంగా వీళ్లిద్దకి కాంబోలో అసలు సినిమా వస్తుందా రాదా అనే ఉత్కంఠే మహేష్ బాబు, రాజమౌళి అభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది. మహేష్ బాబుతో సినిమా చేస్తానని రాజమౌళి చెప్పడం.. ఆయనకు తగినటువంటి కథ తన వద్ద సిద్ధంగా ఉందని ప్రముఖ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కూడా ఓ సందర్భంలో చెప్పుకురావడమే వీళ్లిద్దరి కాంబోలో సినిమాపై అభిమానుల అంచనాలకు కారణమైంది. అందుకే ఆ రోజు ఎప్పుడొస్తుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also read : వాళ్ల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడలేదు

అయితే, ఎట్టకేలకు మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా లేదా అనే అంశంపై స్వయంగా రాజమౌళినే ఓ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఛానల్‌‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన జక్కన్న.. ఆర్‌.ఆర్‌.ఆర్‌' తర్వాత మహేష్‌బాబుతో (SS Rajamouli to direct Mahesh Babu) సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. కె.ఎల్‌.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తారని స్పష్టంచేశాడు. రాజమౌళి చేసిన ఈ ప్రకటనతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆ సస్పెన్స్‌కు కాస్తా తెరపడినట్లయింది. 

 Also read : KTR supports employees: ఉద్యోగులను తీసేయొద్దు: మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న రౌద్రం రణం రుధిరం (ఆర్‌.ఆర్‌.ఆర్‌) చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని సినిమాల్లాగే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ (RRR shooting) కూడా వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనున్న ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) 2021 సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాతే రాజమౌళి-మహేష్‌బాబు కాంబోలో సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందనే విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చిందన్న మాట. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News