ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనావైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనకు తాజాగా బ్రెయిన్ హేమరేజ్కి ( brain hemorrhage ) గురైనట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన్ను ఐసీయులోకి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కరోనావైరస్ ( Coronavirus ) సోకిన అనంతరం ఆగస్టు 5 నుండి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. Also read : SP Balasubrahmanyam Health condition: అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ఎస్పీ చరణ్
కరోనావైరస్ నుంచి కోలుకుంటున్న బాలు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతారని అభిమానులు ఆశిస్తున్న సమయంలో ఈ విధంగా ఆయన మళ్లీ అస్వస్థతకు గురవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బాలు కరోనా నుంచి ఎలాగైతే కోలుకున్నారో.. అలాగే ఈ అనారోగ్య సమస్య నుంచి కూడా పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతున్ని ప్రార్ధిద్దాం. Also read : Rakul Preet Singh in drugs case: రకుల్ ప్రీత్ సింగ్‌కి NCB స్ట్రాంగ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe