Sita Ramam Poster: బక్రీద్‌ సందర్భంగా.. రష్మిక మందన్న ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్!

Rashmika Mandanna new poster form Dulquer Salmaan's Sita Ramam movie. ఆదివారం బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రష్మిక పాత్రకు సంబంధించిన ఓ ప్రత్యేక పోస్టర్‌ను సీతా రామం చిత్ర యూనిట్ విడుదల చేసింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 11, 2022, 10:47 AM IST
  • 1965 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా
  • రష్మిక మందన్న ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్
  • ఆగష్టు 5న రిలీజ్
Sita Ramam Poster: బక్రీద్‌ సందర్భంగా.. రష్మిక మందన్న ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్!

Rashmika Mandanna first look poster out from Sita Ramam movie: 'పుష్ప' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న.. ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస హిట్స్ కొడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. గోల్డెన్ లెగ్ అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే చేతినిండ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'సీతా రామం' సినిమాలో రష్మిక నటిస్తున్నారు. 

సీతా రామం సినిమా మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారి అయిన దుల్కర్ సల్మాన్.. ప్రేమ కోసం ఎలా పోరాడాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో కశ్మీర్‌ ముస్లిమ్‌ యువతి అఫ్రీన్‌గా రష్మిక మందన్న కనిపంచనున్నారు. ఆదివారం బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రష్మిక పాత్రకు సంబంధించిన ఓ ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముస్లిమ్‌ సంప్రదాయ వస్త్రధారణలోనేషనల్‌ క్రష్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీకు, మీ కుటుంబ సబ్యులకు మా ప్రేమ వారధి అఫ్రీన్ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపున్నారు' అని పేర్కొన్నారు. 

ప్రత్యేక పోస్టర్‌లో రష్మిక మందన్న లుక్ చాలా బాగుంది. పోస్టర్‌లో కన్నడ బ్యూటీ ముస్లిమ్‌ సంప్రదాయ వస్త్రధారణలో ఉన్నారు. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌కు లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తోంది. నేషనల్‌ క్రష్‌ చాలా బాగుందని అందరూ పోస్టులు పెడుతున్నారు. 1965 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కుతోందని, కథాగమనంలో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని చిత్ర యూనిట్ ఇప్పటికే చెప్పింది.  ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‍, కోలీవుడ్‏లో సత్తాచాటుతున్న రష్మిక ఈ సినిమాతో మాలీవుడ్‌లో కూడా స్టార్ కానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ కానుంది. 

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గనున్న బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే  

Also Read: Horoscope Today July 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనూహ్య ధన లాభం!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News