న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టగా ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. మరోవైపు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ను సుమారుగా 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఈ రకమైన సవరణలు వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చిందని, ఈ రేట్లు మే 10వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని అన్నారు. ఎంసీఎల్‌ఆర్‌లో ఇది వరుసగా 12వ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది. అలాగే మూడేళ్ల కాల పరిమితి గల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీనుంచి దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో ఎస్‌బీఐ వికేర్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఈ డిపాజిట్లను అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుందని, 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్‌బీఐ పేర్కొంది. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..