Sarileru Neekevvaru: సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ ప్రోమో వీడియో విడుదల

మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో అజయ్ అనే ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా కన్నడ బ్యూటీ రష్మిక మంధన్న మహేష్ బాబు సరసన జంటగా నటించింది.

Last Updated : Jan 14, 2020, 12:10 PM IST
Sarileru Neekevvaru: సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ ప్రోమో వీడియో విడుదల

మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో అజయ్ అనే ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా కన్నడ బ్యూటీ రష్మిక మంధన్న మహేష్ బాబు సరసన జంటగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కట్టిపడేసే సీన్స్ ఆడియెన్స్‌ చేత సరిలేరు నీకెవ్వరు అనిపిస్తున్నాయి. థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు సినిమాకు వస్తోన్న స్పందన చూసిన మేకర్స్.. తాజాగా ఓ బ్లాక్‌బస్టర్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమోతో పాటు బ్లాక్ బస్టర్ ప్రోమో పేరిట ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా దిల్ రాజు, అనిలు సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News