బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన 'సంజు'

సంజు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది.

Last Updated : Jul 2, 2018, 01:47 PM IST
బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన 'సంజు'

సంజు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా 'బాహుబలి 2:ది కంక్లూజన్‌' పేరిన ఉన్న రికార్డును అధిగమించింది. బాహుబలి 2 హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదలై బెంచ్ మార్క్ రికార్డులను చేసింది. అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు బాహుబలి సృష్టించిన రికార్డులను క్రాస్ చేయలేకపోయాయి. తాజాగా బాహుబలి2 రికార్డును సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' బీట్ చేసింది. ఇందులో రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్ర పోషించారు.

సంజు చిత్రం ఆదివారం (మూడో రోజు) రూ.46.71 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంతకు ముందు ఈ రికార్డు బాహుబలి-2 (హిందీ వర్షన్‌-రూ.46.50 కోట్లు) పేరిట ఉంది. మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్‌ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. రాజ్‌కుమార్‌ హిరాణీ డైరెక్షన్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన 'సంజు' విడుదలైన మూడు రోజుల్లోనే రూ.120 కోట్ల వసూళ్లను రాబట్టి.. ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

 

బాలీవుడ్ 2018 టాప్ 5 చిత్రాలు (విడుదలైన వీకెండ్ లో వసూళ్లు సాధించినవి)

 

సంజు- 120 కోట్లు
పద్మావత్- 114 కోట్లు
రేస్ 3-106.47 కోట్లు
భాగి2- 73. 10 కోట్లు
రైడ్- 41.01 కోట్లు 

 

Trending News