Samajavaragamana song sung by puja hegde : పూజా హెగ్డే నోట.. సామజవరగమన పాట..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి పండగకు విడుదలైన సినిమా 'అల వైకుంఠపురములో..' . ఈ సినిమా ఫుల్ కలెక్షన్లతో టాలీవుడ్  రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.

Last Updated : Jan 20, 2020, 04:06 PM IST
Samajavaragamana song sung by puja hegde : పూజా హెగ్డే నోట.. సామజవరగమన పాట..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి పండగకు విడుదలైన సినిమా 'అల వైకుంఠపురములో..' . ఈ సినిమా ఫుల్ కలెక్షన్లతో టాలీవుడ్  రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది. సినిమాలో అందంగా కనిపించిన బుట్టబొమ్మ హీరోయిన్ పూజాహెగ్డే కూడా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొంది. ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడిన ముద్దుగుమ్మ.. చివరకు తెలుగులో పాట కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సినిమా విజయవంతమైన సందర్భంగా తన మనసులోని భావాలను బయటపెట్టింది ముద్దుగుమ్మ. పూజా హెగ్డే సామజవరగమన పాట పాడుతున్నంతసేపు అంతా అలా సైలెంట్ అయిపోయి పాట విన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో అల్లు అర్జున్ పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టారు. చూస్తుంటే వారిద్దరూ అమ్మడి పాటకు ఫిదా అయినట్లు కనిపించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

 

Trending News