సాహో మూవీ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్

సాహో మూవీ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్

Last Updated : Aug 31, 2019, 05:25 PM IST
సాహో మూవీ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్

ప్ర‌భాస్, శ్రద్ధా కపూర్ జంటగా న‌టించిన సాహో చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. యువ దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుమారు రూ.350 కోట్ల‌కుపైగా బడ్జెట్‌తో రూపొందారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో విడుద‌లైన ఈ సినిమాకు ఆడియెన్స్‌లో డివైడ్ టాక్ వ‌చ్చినప్పటికీ.. ఆ డివైడ్ టాక్ సాహో కలెక్షన్స్‌ని అడ్డుకోలేకపోయింది. 

ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించిన స‌మాచారం ప్రకారం సాహో సినిమాకు తొలిరోజు రూ.104.8 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయని తెలుస్తోంది. తెలంగాణ‌లో రూ.14.1కోట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.42.2కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.13.9కోట్లు, త‌మిళ‌నాడు రూ.3.8కోట్లు, కేర‌ళ రూ.1.2కోట్లు రాగా హిందీ వెర్షన్‌లో సాహో 29.6కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ు రాబట్టిందని సమాచారం. ఇక షేర్ కలెక్షన్స్ పరంగా చూస్తే.. సాహో రూ.68.1కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Trending News