నేనున్న సమయంలో నీవెందుకు రాలేదు?

ప్రియ వారియర్... ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తన కంటిచూపులతో అభిమానులను సంపాదించుకున్న మళయాళ నటి ప్రియ గురించి దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ వరకు మాట్లాడుకుంటున్నారు.

Last Updated : Feb 18, 2018, 04:47 PM IST
నేనున్న సమయంలో నీవెందుకు రాలేదు?

ప్రియ వారియర్... ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తన కంటిచూపులతో అభిమానులను సంపాదించుకున్న  మళయాళ నటి ప్రియ గురించి దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ వరకు మాట్లాడుకుంటున్నారు. కనుసైగలు, ముఖంలో పలికించిన హావభావాలతో కూడిన ఆమె ట్రైలర్ ఆమెకు పెద్ద స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..!!

తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ కూడా ప్రియ ప్రకాశ్ వారియర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ అమ్మాయి అంతులేని స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంటుందని తనకు అనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఎంతో అమాయకంగా కనిపించే ప్రియ... తన ముఖంలో పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. 'మై డియర్ ప్రియ.. రానున్న రోజుల్లో నీ ఏజ్ గ్రూప్ వారు నీ కోసం తహతహలాడుతారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ! నేనున్న సమయంలో నీవెందుకు రాలేదు?' అంటూ సరదాగా కామెంట్ చేశారు.

 

Trending News