రానా ఎంగేజ్డ్.. ఇక మిగిలింది ప్రభాస్.. ట్వీట్ల వర్షం కురిపించిన నెటిజన్లు..

 లాక్ డౌన్ సమయంలో పలువురు సినీ సెలబ్రెటీలు సామజిక మాధ్యమాల్లో చాలా ఆక్టీవ్ గా ఉంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో అభిమానులను అబ్బురపరుస్తున్నారు. మరికొందరు తారలు వీడియోలతో 

Last Updated : May 12, 2020, 09:42 PM IST
రానా ఎంగేజ్డ్.. ఇక మిగిలింది ప్రభాస్.. ట్వీట్ల వర్షం కురిపించిన నెటిజన్లు..

హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో పలువురు సినీ సెలబ్రెటీలు సామజిక మాధ్యమాల్లో చాలా ఆక్టీవ్ గా ఉంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో అభిమానులను అబ్బురపరుస్తున్నారు. మరికొందరు తారలు వీడియోలతో అభిమానులను అలరిస్తుండగా, ఇంకొందరు తమ జీవితానికి సంబంధించిన కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇటీవల హీరోయిన్ తాప్సీ పొన్ను తను ప్రేమించిన వ్యక్తిని సామజిక మాధ్యమ ద్వారా పరిచయం చేస్తూ అందరికీ షాకిచ్చింది. అందాల తార నయనతార తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. తాజాగా హీరో రానా దగ్గుబాటి కూడా ఇలాంటి షాకే ఇచ్చాడు. తాను ప్రేమించిన అమ్మాయిని రానా సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేశాడు. తన ప్రేమను అంగీకరించిందని చెబుతూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాగా, రానా ప్రేమించిన అమ్మాయి పేరు మిహికా బజాజ్. ఈమే డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ కంపెనీని ర‌న్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు సామజిక మాధ్యమాల్లో నెటిజన్లు రానా ఎంగేజ్డ్.. ఇక మిగిలింది  ప్రభాస్ అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News