Ra Ra Reddy: రారా రెడ్డి అంటూ కాక రేపుతున్న అంజలి.. మాచర్ల నియోజకవర్గం సాంగ్ ప్రోమో చూశారా?

Ra Ra Reddy From Macherla Niyojakavargam: దర్శకుడిగా మారిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి  ప్రోమో విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 03:29 PM IST
  • నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం
  • అంజలితో స్పెషల్ సాంగ్
  • రా రా రెడ్డి అంటూ కాక రేపుతోందిగా
 Ra Ra Reddy: రారా రెడ్డి అంటూ కాక రేపుతున్న అంజలి.. మాచర్ల నియోజకవర్గం సాంగ్ ప్రోమో చూశారా?

Ra Ra Reddy From Macherla Niyojakavargam: భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చెక్,  రంగ్ దే,  మాస్ట్రో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈసారి ఎలాగైనా మరో హిట్ కొట్టాలని భావిస్తున్న నితిన్ ప్రస్తుతానికి దర్శకుడిగా మారిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

నితిన్ కెరీర్ లో మొట్టమొదటిసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ జానర్ మూవీగా పొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి,  క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీ ఎంటర్టైన్మెంట్స్,  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ల మీద నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి,  నితిన్ సోదరి నికితా రెడ్డి సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి ఒక ఐటమ్ సాంగ్ చేస్తుందని ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. 

రా రా రెడ్డి అయామ్ రెడీ అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ సినిమా మీద మరింత ఆసక్తి పెంచేస్తోంది. ఇక శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఫుల్ సాంగ్ విడుదల కాబోతోంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఇప్పటికే అప్‌డేట్‌ల‌ను షురూ చేశారు. ఇప్ప‌టికే సినిమా నుంచి విడుదలైన పోస్ట‌ర్‌లు మిగతా ప్రమోషనల్ స్టఫ్ అంతా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకోవడమే కాక సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి. 

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ra Ra Reddy Promo
Also Read: James Caan Death: హాలీవుడ్‌లో విషాదం.. గాడ్ ఫాదర్ స్టార్ జేమ్స్ కాన్ కన్నుమూత..

Also Read: Vishnu Priya Pics: శారీలో సెగలు పుట్టిస్తున్న విష్ణు ప్రియ.. టాప్ టు బాటమ్ అంతా..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News