శ్రీదేవి కోసం పాటపాడి నివాళులర్పించిన ప్రియా వారియర్

శ్రీదేవి జ్ఞాపకంగా పాటపాడిన ప్రియా వారియర్

Last Updated : Feb 28, 2018, 03:56 PM IST
శ్రీదేవి కోసం పాటపాడి నివాళులర్పించిన ప్రియా వారియర్

సినీన‌టి శ్రీదేవి మృతిప‌ట్ల మలయాళ సినిమా 'ఒరు అదార్ లవ్' మూవీ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గ‌తంలో దర్శకుడు కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ‘తుమ్‌ కభి హై ఖబర్‌ ముఝ్ కో భి.. హో రహా హే జుదా..’అనే పాటను పాడుతూ ప్రియా వారియర్ నివాళులు అర్పించారు. చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదని, తరువాత‌ కలుద్దామ‌ని మాత్రమే చెబుతుందని పోస్టులో పేర్కొన్నారు. శ్రీదేవి మరణవార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని రెండు రోజుల క్రితం ప్రియా వారియర్ ట్విట్టర్ లో తెలిపిన సంగతి తెలిసిందే..!

 

Trending News