ప్రభాస్‌కి నచ్చిన హీరోయిన్

సాహోకు నచ్చిన కోలీవుడ్ హీరోయిన్ 

Last Updated : Aug 28, 2019, 04:36 PM IST
ప్రభాస్‌కి నచ్చిన హీరోయిన్

సాహో సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ దేశవ్యాప్తంగా కలియ తిరుగుతూ సాహో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళంలో విడుదల కానున్న సాహో చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు చెన్నైకి వెళ్లిన ప్రభాస్‌ నుంచి అక్కడి కోలీవుడ్ మీడియా పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం తమిళంలో దూసుకెళ్తున్న కథానాయికలలో తనకు ఎవరంటే ఇష్టం అని అడిగింది. మీడియా మిత్రులు అడిగిన ఈ ప్రశ్నకు స్పందించిన ప్రభాస్.. తనకు నయనతార అంటే ఇష్టమని టక్కున సమాధానం ఇచ్చాడు. నయనతార తెరపై కనిపించే తీరు, ఆమె అభినయం తనకు బాగా ఇష్టం అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్, నయనతారల కాంబోలో 2007లోనే యోగి అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించలేదు.

Trending News