ప్రపంచాన్ని కదిలిస్తోన్న ఫొటో.. మానవత్వం మేల్కోవాలి!

ఓ ఒరంగుటాన్‌ను చూసి తోటివారికి సాయం చేయడం అలవాటు చేసుకోవాలంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 13, 2020, 11:36 AM IST
ప్రపంచాన్ని కదిలిస్తోన్న ఫొటో.. మానవత్వం మేల్కోవాలి!

ఇండోనేషియాలోని బోర్నియో అడవిలో ఒక అద్భుతమైన సీన్ కనిపించింది. నీటిలో ఉన్న వ్యక్తికి పైకి రావడానికి ఓ ఒరంగుటాన్ (ఒక కోతి జాతి) చేతి చాపిన ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మనుషుల మధ్య సంబంధాలు ఏమవుతున్నాయి, మనం తోటివారికి సాయం చేయడానికి వెనకాడుతున్నాం, ఆస్తి కోసం సొంతవారిని చంపుకుంటున్నారని, అయితే ఓ ఒరంగుటాన్‌ను చూసి తోటివారికి సాయం చేయడం అలవాటు చేసుకోవాలంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

భారత్‌కు చెందిన జియాలజిస్ట్, అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్ అయిన అనిల్ ప్రభాకర్ ఇండోనేషియాలోని బోర్నియో ఒరంగుటాన్ సర్వైవల్ ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో అక్కడ తనకు కనిపించిన సన్నివేశాన్ని ఫొటోలు తీసినట్లు అనిల్ ప్రభాకర్ చెప్పారు. నీళ్లలో ఉన్న వ్యక్తి వార్డెన్ అని, అతడు పైకి రావడానికి ఒరంగుటాన్ సాయం చేయాలని భావించి చేయి ఇచ్చింది. ఇది చూసి చలించిపోయిన తాను వెంటనే కెమెరాకు పని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. గత సెప్టెంబర్‌లో తీసిన ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా బోర్నియో ఒరంగుటాన్ సర్వైవల్ యూకే - బాస్  యూకే సంస్థ తమ ఫేస్‌బుక్‌లో ఫొటో పోస్ట్ చేసింది.

‘నీకు ఏమైనా సాయం కావాలి.. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కానీ జంతువులు మనల్ని గైడ్ చేస్తున్నాయి. మనలో మానవత్వాన్ని మేల్కోలుపుతున్నాయి. థ్యాంక్యూ అనిల్. ఫొటో షేర్ చేయనిచ్చినందుకు ధన్యావాదాలు’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. వాస్తవానికి ఆ అడవిలో పాములు ఈ ఒరంగుటాన్లను కరుస్తుంటాయి. పాముల నుంచి ఒరంగుటాన్లను కాపాడేందుకు పనిచేస్తున్న వ్యక్తే ఈ నీళ్లలో కనిపిస్తున్నారు. అతడికి సాయం చేసేందుకు ఒరంగుటాన్ చేయి చాచిన ఫొటోనే మానవాళిని కదిలిస్తోంది. ఇకనైనా మేల్కొందామంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News