సిగరెట్ స్నేహం: ఎన్టీఆర్‌తో ఏఎన్నార్ కొత్త పోస్టర్

"ఎన్టీఆర్" బయోపిక్ సందడి సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది. చిత్ర నిర్మాతలు రోజుకో కొత్త పోస్టర్ విడుదల చేస్తూ అభిమానులను ఉర్రూతలెక్కిస్తున్నారు. 

Last Updated : Sep 21, 2018, 06:40 PM IST
సిగరెట్ స్నేహం: ఎన్టీఆర్‌తో ఏఎన్నార్ కొత్త పోస్టర్

"ఎన్టీఆర్" బయోపిక్ సందడి సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది. చిత్ర నిర్మాతలు రోజుకో కొత్త పోస్టర్ విడుదల చేస్తూ అభిమానులను ఉర్రూతలెక్కిస్తున్నారు. ఇటీవలే ఏఎన్నార్ గెటప్‌లో సుమంత్ పోస్టర్ విడుదలయ్యాక.. ఎన్టీఆర్ గెటప్‌లో ఉన్న బాలయ్యతో ఏఎన్నార్ గెటప్‌లో ఉన్న సుమంత్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టరులో ఇద్దరూ సిగరెట్ కాలుస్తున్నట్లు కనిపించడం విశేషం. అక్కినేని కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిన విషయమే. గుండమ్మ కథ, మాయాబజార్ చిత్రాలలో వారు కలిసి కూడా నటించారు.

అలాగే హీరోలుగా ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించేవారు. అయితే ఆ పోటీ కూడా చాలా ఆరోగ్యకరమైన పోటీ అని.. అభిమానులు ఇద్దరు చిత్రాలకూ బ్రహ్మరథం పట్టేవారని వినికిడి. ప్రస్తుతం "ఎన్టీఆర్" బయోపిక్ చిత్రంపై భారీగా నిర్మాతలకు అంచనాలు ఉన్నాయి. బాలయ్య కూడా ఈ సినిమాలో చాలా పెట్టుబడి పెడుతున్నారు. ఈ చిత్రకథను ఎక్కడ మొదలుపెట్టాలో.. ఎక్కడ ఆపాలో తనకు తెలుసునని ఆయన గతంలోనే ప్రకటించారు. ఇదే చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

తాజాగా కొత్త పోస్టరు సుమంత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.  ‘సోదరత్వం పునః సృష్టి జరుగుతోంది’ అని ఆయన ఆ పోస్టరుకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్‌ ఇందూరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Trending News