మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న "సైరా" చిత్రం పై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలక యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ ఏర్పాట్లను దర్శకుడు సురేంద్ర రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆ యుద్ధ సన్నివేశాల షూటింగ్ సెట్ వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు దర్శకుడు.
‘యుద్ధానికి అంతా సిద్ధం’ అంటూ ట్వీట్ చేసిన సురేందర్‌రెడ్డి.. యాక్షన్ బిగిన్ అని ట్యాగ్ చేశారు. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం 40 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో పాటు.. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను తెరకెక్కించడం జరుగుతోంది. ‘సైరా’ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచా సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు నిర్మాతలు.
ఈ సంక్రాంతి సందర్భంగా "సైరా" చిత్రం తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బేనరుపై రామ్ చరణ్ "సైరా" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ అందించిన కథకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉన్నా.. ఆ తర్వాత ఆయన డేట్స్ కుదరకపోవడం వల్ల తప్పుకోవడం జరిగింది.
All set for the war!#ActionBegins #SyeRaa #Georgia pic.twitter.com/LRXL4o3wrn
— SurenderReddy (@DirSurender) September 17, 2018