నాని బిగ్‌బాస్ సీజన్2 రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 1 టీవీ షో ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే..!

Last Updated : Apr 21, 2018, 01:44 PM IST
నాని బిగ్‌బాస్ సీజన్2 రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 1 టీవీ షో ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే..! ఇక త్వర‌లోనే బిగ్‌బాస్ సీజన్2 రానుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క‌మిట్‌మెంట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 2 నుంచి త‌ప్పుకున్నాడు. ప్రస్తుతం తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో, అలానే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్నాడు.

తారక్ తప్పుకోవడంతో ఈ షోకి హోస్ట్‌గా నేచుర‌ల్ స్టార్ నానిని నియమించుకున్నారు బిగ్‌బాస్ యాజమాన్యం.  జూ.ఎన్టీఆర్‌కు అతడికి ఉన్న స్టార్‌డం మేరకు సీజన్1లో వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు రూ. 6.5 కోట్లు ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాపులారిటీ ఈ షోకు ఎంతో ఉపయోగపడింది. షో కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నానికి అందులో సగానికి కొంచెం ఎక్కువగా మాత్రమే ఆఫర్ చేస్తున్నారని నివేదికల సారాంశం. ఈ షో చేస్తున్నందుకు నానికి రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని సమాచారం. అలానే..నాని కూడా సినిమాల  రెమ్యునరేషన్‌ను కూడా రూ.4 కోట్ల నుండి రూ.8 కోట్లకు పెంచినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా.. దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతి వారాంతంలో రెండు రోజులు అంటే, సుమారు 20 రోజుల పాటు తన సినిమాలను, కాల్ షీట్లను పక్కనబెట్టి నాని ఈ షో కోసం పని చేయాల్సి వుంటుంది. 

Trending News