టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇటీవలే నటి సావిత్రి జీవిత నేపథ్యంలో 'మహానటి' తెరకెక్కించారు. ఇక త్వరలో ఎన్టీఆర్, వైఎస్సార్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కాంతారావు, కోడి రామ్మూర్తి నాయుడు, టైగర్ నాగేశ్వరరావుల బయోపిక్‌లు రానున్నాయి.
స్టువర్టుపురం దొంగగా ఒకప్పుడు భయానక వాతావరణం సృష్టించిన టైగర్ నాగేశ్వర రావు బయోపిక్‌లో రానా నటిస్తాడని మొదట ప్రచారం జరగగా.. అనివార్య కారణాలతో ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారు. దీంతో రానా స్థానంలో నేచురల్ స్టార్ నాని నటించనున్నాడు. దర్శకుడు వంశీకృష్ణ ఈ కథను నానికి వినిపించగా.. నటించేందుకు నేచురల్ స్టార్ ఒప్పుకున్నాడట. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఎన్నో బ్యాంకులని కొలగొట్టి చివరికి ఒక భారీ ఎంకౌంటర్‌లో చనిపోయాడు. ఆయన పాత్రలో నటించేందుకు నాని సుముఖంగానే ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
చివరిగా 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. జూన్ 10న బుల్లితెరపై బిగ్ బాస్ 2 షోలో సందడి చేయనున్నాడు.