Mahesh Babu: నా అసలైన సంతోషం నువ్వే: నమ్రతా శిరోద్కర్

Mahesh Babu Latest Photo | టాలీవుడ్ కపుల్స్ నమ్రతా శిరోద్కర్, మహేశ్ బాబు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. నా అసలైన ప్రేమకు అర్థం నువ్వే మహేశ్ అంటూ భార్య నమ్రత చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Last Updated : Sep 22, 2020, 10:16 AM IST
Mahesh Babu: నా అసలైన సంతోషం నువ్వే: నమ్రతా శిరోద్కర్

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్రా శిరోద్కర్ (Namrata Shirodkar) ఉంటారు. మహేశ్ బాబు (Mahesh Babu)తో పెళ్లి తర్వాత నమ్రతా ఇంటికి పరిమితమైనా ప్రిన్స్ మహేశ్ బాబుకు ఆమె సర్వస్వం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా దాదాపు 5 నెలలు ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో కుటుంబానికి విలువైన సమయానికి కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో వీరి ముద్దుల తనయ సితార తీసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. 

భర్త మహేశ్‌పై తన ప్రేమను తన జీవితం గురించి నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రేమతో ఉండటం వల్ల నాకు నమ్మకం కలిగింది. మనం సంతోషానికి ఉండటానికి కారణం ప్రేమ. ఒకరితో ఒకరు.. ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలని.. అలాగే జీవించాలి. నా నిజమైన సంతోషంతో నేను దిగిన ఫొటో అని’ మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటోను నమ్రతా పోస్ట్ చేసింది.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

The more I think the more I’m convinced the root cause of our Being, is governed by love ❤️ Love is the only emotion that makes us live happy lives .. kindness, empathy compassion all stem from this emotion of love ♥️♥️love is the truest n highest form of being evolved !! This is my perception !! So be loving and be kind and be compassionate people to each other !! We have one live to live and one life to give ♥️♥️♥️#behappy #besafe #bekind this ones with my true happiness !! Pic.Courtesy @sitaraghattamaneni 😂

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

కాగా, మహేశ్ బాబు సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉంటే నమత్రా.. గౌతమ్, సితారలను కంటకి రెప్పలా చూసుకుంటోంది. వారి కోసం అధిక సమయాన్ని కేటాయిస్తూనే.. భర్త మహేశ్‌కు సంబంధించిన సినిమా అప్‌డేట్స్, ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇటీవల మహేశ్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం సెట్‌లో కనిపించగా ఆ ఫొటో సైతం వైరల్ అయింది.  

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News