సోనాలీ బింద్రేకు ధైర్యం చెబుతూ నాగ్ ట్వీట్

Last Updated : Jul 6, 2018, 03:55 PM IST
సోనాలీ బింద్రేకు ధైర్యం చెబుతూ నాగ్ ట్వీట్

క్యాన్సర్ తో బాధపడున్న సోనాలీ బింద్రేకు పరామర్శల వెల్లువ కురుస్తోంది.. సినీ ప్రముఖలతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఆమెకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలి డియర్ అంటూ మెజేస్ పంపారు. సోనాలీ 'నీవు తొందరగా కోలుకోవాలి. క్యాన్సర్ ను జయించాలన్ననీ గొప్ప సంకల్పానికి బలం చేకూరాలని కోరుకుంటున్నా డియర్' అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా 'థ్యాంక్స్ నాగ్' అంటూ సోనాలీ రిప్లై ఇచ్చింది. సూపర్ హిట్ మూవీ మన్మథుడులో నాగ్ సరసన సోనాలీ బింద్రే నటించిన విషయం తెలిసిందే. 

తాను క్యాన్సర్ తో బాధపడుతున్నానంటూ సోనాలీ చేసిన ట్వీట్ తో సినీ పరిశ్రమతో పాటు లక్షలాది మంది అభిమానులను షాక్ కు గురిచేసింది. ఈ విషయంపై  సినీ ప్రముఖలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఆమె కూడా ఎంతో ఓపికగా రిప్లై ఇస్తున్నారు.

Trending News