Milk And Spice For Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తీసుకునే ఆహారాలను బట్టి రక్తంలో చక్కెర పరిమాణం అధారపడి ఉంటుంది. వీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు. డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. చాలా మందిలో రక్తంలో చక్కెర పరిమాణం గ్లూకోజ్ స్థాయిలపై ఆధారడి ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఔషధాలున్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ రక్తంలో చక్కెరను నియత్రించుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి.
పాలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమం:
రోజూ తీసుకునే పాలలో కొన్ని మసాలా దినుసుల పొడిని వేసుకుని తాగితే.. రక్తంలో చక్కెర పరిమాణం సులభం నియంత్రణలో ఉంటుంది. ఈ మసాలా దినుసులలో ఉండే మూలకాలు డయాబెటిక్ రోగులకు ఉపశమనం కలిగిస్తుంది.
ఈ 3 మసాలాల దినుసులు శరీరానికి చాలా మంచిది:
1. పసుపు:
పసుపులో శరీరానికి కావాల్సిన అనేక రకాల మూలికలు ఉంటాయి. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపులో కర్కుమిన్ పరిమాణం అధిక మోతదులో ఉంటాయి, కావున కర్కుమిన్ పరిమాణం కారణంగా నియంత్రిస్తుంది. పచ్చి పసుపు పొడిని పాలలో కలిపి తీసుకుంటే.. మధుమేహంతో పాటు జలుబు, జ్వరం, గొంతునొప్పి, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. దాల్చిన చెక్క:
దాల్చినచెక్కలో బయోయాక్టివ్ భాగాలు పుష్కలంగా ఉంటాయి. కావున రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. పలు పరిశోధన ప్రకారం.. టైప్-2 మధుమేహం ఉన్న రోగులకు మంచి ఔషధంగా లభిస్తుంది. అయితే దీని కోసం ఒక గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే.. మంచి ఫలితాలు పొందగలుగుతారు.
3. మెంతులు:
మెంతులు శరీరానికి చాలా అవసరం కాబట్టి.. ముధుమేహంతో బాధపడే వారు తప్పనిసరిగా వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కరిగే ఫైబర్ అధిక పరిమాణతంలో ఉంటుంది. కావున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook