పవన్‌ను "బిగ్ బ్రదర్"గా పేర్కొన్న మనోజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ బిగ్ బ్రదర్‌గా సంబోధించారు.

Last Updated : Sep 2, 2018, 08:23 PM IST
పవన్‌ను "బిగ్ బ్రదర్"గా పేర్కొన్న మనోజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ బిగ్ బ్రదర్‌గా సంబోధించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్వీట్ చేసిన మంచు మనోజ్ అందులో ఈ విధంగా పేర్కొన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్‌ గారు. ఈ సంవత్సరం మీరు చేసుకుంటున్న పుట్టినరోజు వేడుకలు మీకు చాలా ప్రత్యేకమైనవి. వచ్చే సంవత్సరానికల్లా మీరు మంచి రాజకీయ నేత అవుతారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను బిగ్‌ బ్రదర్‌’’ అని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో అనేకమంది మనోజ్ ట్వీట్‌కు బదులిస్తూ.. పాజిటివ్‌గా రియాక్టరయ్యారు. కొందరు ఆయనను కూడా జనసేనలో చేరాలని కోరారు. కొందరు మనోజ్ చాలా మంచివాడని.. కలుపుకొనిపోయే వ్యక్తిత్వం కలవాడని.. పవన్ కళ్యాణ్‌కి తాను శుభాకాంక్షలు తెలపడం తమకు ఎంతో సంతోషం కలిగించిదని కూడా పేర్కొన్నారు.

మంచు మనోజ్ కొద్ది నెలలుగా ఎలాంటి సినిమాలు కూడా సైన్ చేయలేదు. ఇటీవలే ఈ విషయంపై కూడా మనోజ్ క్లారిటీ ఇచ్చారు. తనకు తిక్క ఉందని అందుకే సినిమాలు చేయడం లేదని తెలిపారు. అయితే ఎందుకు సార్.. అని ప్రశ్నించిన నెటిజన్‌కు కూడా ఆయన జవాబిచ్చారు. "చెప్తా చెప్తా అన్నీ సమయం వచ్చినప్పుడు చెప్తా" అని కొంటెగా జవాబిచ్చారు. మంచు మనోజ్ నటించిన ఆఖరి చిత్రం "ఒక్కడు మిగిలాడు" 2017 విడుదలైంది.

Trending News