'మహానటి'లో భానుమతిగా అనుష్క..!

ఇటీవలే విడుదలైన 'భాగ‌మ‌తి' మూవీతో మెప్పించిన అనుష్కకు మరో మంచి ఆఫ‌ర్ వెతుక్కుంటూ వ‌చ్చింది.

Last Updated : Feb 18, 2018, 04:31 PM IST
'మహానటి'లో భానుమతిగా అనుష్క..!

ఇటీవల విడుదలైన 'భాగ‌మ‌తి' మూవీతో మెప్పించిన అనుష్కకు మరో మంచి ఆఫ‌ర్ వెతుక్కుంటూ వ‌చ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో భానుమ‌తి పాత్ర కోసం అనుష్క‌ను చిత్ర యూనిట్ సంప్రదిస్తోంది. ఇందుకోసం స్వయంగా నిర్మాత అశ్వినీదత్ రంగంలోకి దిగినట్టు సమాచారం.  అయితే అనుష్క నుండి ఇప్పటివరకు అధికారికంగా ఈ మూవీలో నటిస్తున్నట్లు ఎలాంటి సమాచారం రాలేదు.

ఈ మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ న‌టిస్తుండా... జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో విజయ్ దేవరకొండ, జమున పాత్రలో సమంత, ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు, వీఎన్ జానకిగా షాలినీ పాండే, ఆలూరి చక్రపాణిగా ప్రకాశ్ రాజ్, సింగీతం శ్రీనివాస్ రావుగా తరుణ్ భాస్కర్, నటిస్తున్నారు.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా... సినిమా బడ్జెట్ 20 కోట్లుగా నిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 28 వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Trending News